North Korea – South Korea : ఉత్తర కొరియా – దక్షిణ కొరియాలు ఒకరి పేరు వింటేనే మరొకరు రగిలిపోతుంటారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఏదో ఓ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఏదో తీరుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే.. ఉత్తర కొరియా(North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్న చర్యలకు మాత్రం అడ్డు ఉండదు. వింత వింత అలోచనలతో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటాడు.. కిమ్. అతడికి ఏం తోస్తే, ఎలా అనిపిస్తే.. అలా నిత్యం ఉత్తర కొరియా మీద పగ తీర్చుకునేందుకే చూస్తుంటాడు. అలా.. ఉత్తర కొరియాను రెచ్చగొట్టేందుకు ఇప్పుడు ఓ కొత్త ఐడియాతో వచ్చాడు. అతని చర్యలకు.. దక్షిణ కొరియా(South Korea) అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నాడు అంటే..
ఉత్తర కొరియా – దక్షిణ కొరియా దేశాల సరిహద్దులో డాంగ్ సాన్(Dangsan) అనే గ్రామం ఉంది. గత కొన్నాళ్లుగా ఈ గ్రామస్తులకు పగలు, రాత్రి లేకుండా తన చర్యలతో హింసిస్తున్నాడు.. కిమ్ జోంగ్ ఉన్. తన సరిహద్దు వెంట.. భారీగా పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టిన కిమ్ సైన్యం. వాటి నుంచి భయంకర శబ్దాలను వినిపిస్తున్నాయి. ఈ గ్రామాన్ని డీ-మిలిటరైజ్ జోన్ (Demilitarised Zone)గా ప్రకటించారు.దాంతో.. అక్కడ సైన్యం ఉండదు. అయినా.. అక్కడి ప్రజలను ఉత్తర కొరియా చిత్రహింసలకు గురిచేస్తోంది.
నరాలు చిట్లిపోతున్న శబ్దాలు, మెటాలిక్ గ్రైండింగ్, గుడ్ల గూడల శబ్దాల వంటి వాటితో పాటు బాంబుల మోతలు, తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాడు. ఈ లౌడ్ స్పీకర్లు.. సరిహద్దుల్లో 24 గంటల పాటు మోగుతున్నాయని సరిహద్దు ప్రాంత ప్రజలు వాపోతున్నారు. కిమ్ చర్యలతో .. రాత్రిళ్లు నిద్ర పడడం లేదని, పగలు సైతం వేరే పనులు చేసుకునేందుకు వీలవడం లేదని వాపోతున్నారు. చిన్నపిల్లలు నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారని, ఆ శబ్దాలకు నిద్రపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల, చిన్నపిల్ల పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. ఉత్తర కొరియా సైన్యం చేస్తున్న పనులకు.. ఏం చేయాలో తెలియక దక్షిణ కొరియా వాసులు అల్లాడుతున్నారు.
సరిహద్దుల్లోని లౌడ్ స్పీకర్లతో ఈ గ్రామ ప్రజలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నారని అధికారులు తెలుపుతున్నారు. వారి మెదడు మొద్దుబారిపోతుందని, శరీరం అలసిపోయినట్లు అనిపించి.. తూలి పోతున్నారని అంటున్నారు. భారీ శబ్దాలతో అక్కడి ప్రజల్లో ఇన్ సోమ్నియా (insomnia) తీవ్రమైన తలనొప్పి (headaches) మానసిక, శారీరక ఒత్తిడికి (stress) గురవుతున్నారు.
దక్షిణ కొరియా సేనలు.. అమెరికా, దాని మిత్ర దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్న సమయంలోనే ఉత్తర కొరియా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని చూస్తోంది. గతంలోనూ.. సరిహద్దుల్లో ఉత్తర కొరియా బెలూన్లు ఎగురుతున్నాయని ఆరోపిస్తూ.. దక్షిణ కొరియా పై భారీ ఎత్తున్న బెలూన్లను వదిలారు. కొన్ని రోజుల తర్వాత.. చెత్తను నింపిన బెలూన్లను ఉత్తర కొరియా గగనతలంలోకి వదిలి ఇబ్బందులు సృష్టించారు. దాంతో.. అక్కడ విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. నౌకాశ్రయాలు సహా అనేక కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. పైగా.. ఉత్తర కొరియా వదిలిన చెత్తను శుభ్రం చేసేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. అలాంటి.. చర్యల నుంచి ఇప్పుడు లౌడ్ స్పీకర్లతో ఇబ్బందులు పెట్టే వరకు ఉత్తర కొరియా నియంత కిమ్ చర్యలు.. ఊహాతీతం అంటున్నారు.. విశ్లేషకులు.
Also Read : Joe Biden : అధికారం పోతుందని బైడెన్ అంతపని చేశారా.? ప్రపంచం అంతమైనా ఏం కాదనుకున్నారా.?
ఉత్తర కొరియా చర్యలకు తలలు పట్టుకుంటున్న దక్షిణ కొరియా అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. బాధిత గ్రామంలోని ఇళ్ల తలపుల్ని స్టైరో ఫోమ్ తో మూసేస్తున్నారు. గ్రామస్థులు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. కాగా.. ఈ రెండు సోదర దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ఎన్ని ప్రయత్నాల చేసినా.. కిమ్ వాటిని పట్టించుకోవడం లేదు. దాంతో.. 1950-53 నాటి యుద్ధం తాలుకు ఉద్రిక్తతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.