BigTV English

OTT Movie : వీడు మామూలోడు కాదు… మర్డర్లు చేస్తూ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే డిటెక్టివ్

OTT Movie : వీడు మామూలోడు కాదు… మర్డర్లు చేస్తూ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే డిటెక్టివ్

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు మన ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. కంటెంట్ బాగున్న ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. ఇన్వెస్టిగేషన్ కథతో వచ్చిన ఒక హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక రేంజ్ లో పిచ్చెక్కిస్తూ, ట్విస్ట్ లతో అదరగొడుతుంది. ఒక మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే డిటెక్టివ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది పేల్ బ్లూ ఐ’ (The Pale Blue Eye). 2022 లో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి స్కాట్ కూపర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో క్రిస్టియన్ బేల్, హ్యారీ మెల్లింగ్, గిలియన్ ఆండర్సన్, లూసీ బోయిన్టన్, షార్లెట్ గెయిన్స్‌బర్గ్, టోబి జోన్స్, హ్యారీ లాటీ వంటి నటులు నటించారు. 1830 న్యూయార్క్‌లోని వెటరన్ డిటెక్టివ్ అగస్టస్ ల్యాండర్‌చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీలో యువ సైనిక క్యాడెట్ అయిన ఎడ్గార్ అలన్ పో సహాయంతో అగస్టస్ వరుస హత్యలను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక డిటెక్టివ్ ఆఫీసర్ గా పని చేసిన హీరో రిటైర్డ్ అవుతాడు. ఇతని భార్య చనిపోవడంతో పాటు, కూతురు కూడా కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత హీరో మద్యానికి బానిస అయిపోతాడు. ఇతను చాలా గొప్ప డిటెక్టివ్. కేసులు సాల్వ్ చేసే విధానంలో రేటింగ్ 100% ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒంటరిగా మద్యం తాగుతూ ఇంటికే పరిమితం అవుతాడు. ఒకరోజు ఒక అకాడమీ నుంచి హిచ్ కాక్ అనే వ్యక్తి వచ్చి, ఒకసారి ఆఫీస్కి రావాల్సిందిగా అడుగుతాడు. పరిస్థితి తీవ్రత గురించి చెప్పడంతో, హీరో రావడానికి ఒప్పుకుంటాడు. అక్కడికి వచ్చిన హీరోకి వాళ్ళు ఫ్రై అనే ఒక వ్యక్తి మర్డర్ గురించి చెప్తారు. అతన్ని చంపి గుండెను కూడా తీసుకువెళ్లి ఉంటారు. కొంతమంది ఆత్మహత్య అంటుండగా, మరి కొంతమంది హత్యగా చెప్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకుని ఉంటే, గుండె ఎలా బయటికి వస్తుందని అనుకుంటాడు హీరో. తనకు తెలిసిన వ్యక్తి ఎడ్గార్ సహాయంతో, ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. చనిపోయిన ఫ్రై అనే వ్యక్తికి, లియా అనే ఒక ప్రియురాలు ఉండేదని తెలుసుకుంటాడు.

ఆ తర్వాత రెండు జంతువులను చంపి, వాటికి కూడా గుండెను తీసి ఎత్తుకెళ్లి ఉంటారు. ఒకచోట క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తిస్తాడు హీరో. ఈ పూజలు చేసిన వ్యక్తి, హత్య కూడా చేసి ఉంటాడని గ్రహిస్తాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి హత్య కూడా ఇలాగే జరుగుతుంది. ఈ హత్యలు చేస్తున్నది లియా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తొస్తాడు హీరో. వాళ్లను పట్టుకునే క్రమంలోనే ఒక పెద్ద ప్రమాదం జరిగి వాళ్లు బాగా గాయపడతారు. ఆహంతుకులను గుర్తించి ఏజెన్సీకి అప్పజెప్తాడు. ఈ మూవీలో క్లైమాక్స్ అదిరిపోతుంది. నిజానికి ఆహత్యలు హీరోనే చేస్తుంటాడు. తన కూతుర్ని అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు ఘోరంగా ఆఘాయిత్యం చేస్తారు. ఆ అవమానం భరించలేక తండ్రి చూస్తుండగానే కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. తన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణమైన వాళ్లకు శిక్ష వేయాలని అప్పుడే నిర్ణయించుకుంటాడు హీరో. ఈ క్రమంలోనే వాళ్లను చంపడం మొదలు పెడతాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న హీరో ఫ్రెండ్ కనిపెడతాడు. చివరికి హీరోని అతని ఫ్రెండ్ పోలీసులకు పట్టిస్తాడా ? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×