Heroine : నందమూరి బాలయ్య సినిమా స్టోరీలే కాదు.. అటు హీరోయిన్లు కూడా వెరీ స్పెషల్ అన్నట్లు ఉంటారు. ఆయన నటిస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో హీరోయిన్లు బాలయ్య తో జోడి కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా హీరోకు జోడిగా నటించాలని ముందుకు రావడం విశేషం.. అయితే బాలయ్య నటించిన హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్ సినిమాలను పక్కనపెట్టి దైవ చింతన చేసుకుంటుంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎక్కువగా దైవ భక్తిని చాటుకుంటున్నారు. పలు ఆలయాలను సందర్శిస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ డివోషనల్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు.. బాలయ్య హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్ రెండేళ్ల క్రితం ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇక గత ఏడాది దార్డ్ అనే సినిమాలో నటించిన అమ్మడు సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ సందడి చేస్తుంది.. ఆమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు డివోషన మోడ్ కి స్విచ్ ఆన్ అయ్యింది.. ఇటీవల గుడ్లు, గోపురాలు అంటూ తిరుగుతుంది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం హీరోయిన్లు అందరు కూడా ప్రయాగ్ కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కూడా మహా కుంభమేళాకి వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసింది. దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సెలబ్రిటీస్ అంతా కూడా కుభమేళాకి వెళ్లి అక్కడ తాము ఆచరించిన పవిత్ర స్నానాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోనాల్ ఫోటోలు కూడా ఆమె ఫాలోవర్స్ కి తెగ నచ్చేస్తున్నాయి. ఈమె సినిమాల విషయానికొస్తే.. సోనాల్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 ఏళ్లు అవుతున్నా ఆమెకు రావాల్సిన సరైన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు.. ఇక ముందు ఈమెకు మంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి..
ఇక రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలయ్య తో కలిసి నటించింది. ఎఫ్3 తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ లో చేసింది అమ్మడు మెరిసింది.. ఆ తర్వాత బాలయ్య ను నమ్ముకుంది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకొంటూ బిజీగా ఉంది..