Comedy Thriller OTT: మూవీ లవర్స్ఒక్కొక్కరు ఒక్కొక్క జానర్ సినిమాలను ఇష్టపడతారు.. కొందరు థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడితే, మరికొందరు కామెడీ చిత్రాలను ఇష్టపడతారు. ఈమధ్య థియేటర్లోకి రకరకాల కథల తో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదే అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని అందుకుంటున్నాయి.. థియేటర్ల లో సక్సెస్ అయిన అవ్వకపోయినా కూడా ఓటిటిలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. తాజాగా ఓ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఆ మూవీ పేరేంటి..? స్ట్రీమింగ్ ఎక్కడా అవుతుందో ఒక్కసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
టాలీవుడ్ కమెడీయన్ వెన్నెల కిషోర్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ మంచి వ్యూస్ ను రాబడుతుంది. తాజాగా నిన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీలో హీరోగా కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, శియా గౌతమ్ కీలక పాత్రల్లో నటించాడు. డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్‌గా దర్శకుడు రైటర్ మోహన్ ఈ మూవీని రూపొందించారు.. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.. డైరెక్టర్ కాస్త కన్ఫ్యుజ్ అవ్వడంతో మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది.. రాజీవ్‌గాంధీ చనిపోయిన రోజే మేరీ అనే యువతి శ్రీకాకుళం బీచ్‌లో చనిపోతుంది. ఈ కేసులో హంతకుల ను పట్టుకునే పనిని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్‌హోమ్స్‌కు అప్పగిస్తాడు. అయితే ఆ హత్యకు ఆమె స్నేహితులకు ఏదో సంబంధం ఉందని ఆ డీటేక్టివ్ అనుకుంటాడు. అయితే అసలు మేరీ ఎలా చనిపోయింది. ఆమె హత్య వెనుక ఎవరో హస్తం ఉంది అనేది ఈ మూవీ స్టోరీ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ కమెడియన్‌లలో ఒకరిగా వెన్నెలకిషోర్ కొనసాగుతున్నాడు. గత ఏడాది 20కి పైగా సినిమాలు చేశాడు.. రీసెంట్ గా బ్రహ్మానందం మూవీలో నటించాడు. ఆ మూవీ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
వెన్నెల కిషోర్ గత కొన్నేళ్లుగా కమెడియన్గా రాణిస్తున్నారు.. ఎన్నో చిత్రాల లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి అందరిని మెప్పించాడు. ఈమధ్య ప్రధాన పాత్రలో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అటు హీరోయిన్ అనన్య నాగన్న కూడా చిత్రాల లో నటిస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలిసిందే. ప్రస్తుతం ఈమె రెండు, మూడు భారీ ప్రాజెక్టుల లో నటిస్తూ బిజీగా ఉంది..