BigTV English

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : యానిమేటెడ్ స్టోరీలను పిల్లలు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన సిరీస్ లను ఇక వదలమన్నా వదలరు. ఈ సిరీస్ లు, సినిమాలు ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా చూపుకూడా తిప్పుకోరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యానిమేషన్ సిరీస్ మార్వెల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందింది. ఒక జాంబీ ప్రపంచంలో సూపర్ హీరోస్ చేసే పోరాటంతో ఈ కథ నడుస్తుంది. ఈ రోజునుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అంతేకాకుండా ఆడియన్స్ అవార్డ్‌కి కూడా నామినేట్ అయింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘మార్వెల్ జాంబీస్’ (Marvel Zombies) 2025లో విడుదలైన అమెరికన్ యానిమేటెడ్ మినీసిరీస్. దీనిని మార్వెల్ స్టూడియోస్ యానిమేషన్ బ్యానర్‌పై బ్రయాన్ ఆండ్రూస్, జెబ్ వెల్స్ రూపొందించారు. ఇమాన్ వెల్లాని (కమలా ఖాన్/మిస్ మార్వెల్), హడ్సన్ థామ్స్ (పీటర్ పార్కర్/స్పైడర్-మాన్), ఆక్వాఫినా (కాటీ), సిమూ లియు (షాంగ్-చీ), ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), డేవిడ్ హార్బర్ (రెడ్ గార్డియన్), ఎలిజబెత్ ఓల్సెన్ (వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్), హైలీ స్టీన్‌ఫెల్డ్ (కేట్ బిషప్), డొమినిక్ థోర్న్ (రిరి విలియమ్స్/ఐరన్‌హార్ట్), టాడ్ విలియమ్స్ (బ్లేడ్ నైట్) వంటి స్టార్ వాయిస్ కాస్ట్‌తో, స్టెల్లార్ క్రియేటివ్ ల్యాబ్ యానిమేషన్ ఈ సినిమాను అందించింది. 2025 సెప్టెంబర్ 24, డిస్నీ+లో నాలుగు ఎపిసోడ్‌లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి

స్టోరీలోకి వెళ్తే

ఈ సిరీస్ జాంబీ యూనివర్స్ లో జరుగుతుంది. అక్కడ క్వాంటం రియల్మ్ నుంచి వచ్చిన వైరస్ అవెంజర్స్‌తో సహా ఎక్కువ మందిని జాంబీలుగా మార్చేస్తుంది. కమలా ఖాన్ ఈ స్టోరీలో ఒక ఫ్రోడో లాంటి క్యారెక్టర్‌గా లీడ్ చేస్తుంది. ఆమెతో పాటు షాంగ్-చీ, కాటీ, యెలెనా బెలోవా, రెడ్ గార్డియన్, కేట్ బిషప్, జిమ్మీ వూ, బ్లేడ్ నైట్ లాంటి సర్వైవర్స్ ఒక టీమ్‌గా జాంబీ ప్లేగ్‌ని ఆపే కీని వెతుకుతారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో కమలా ఒక డైస్టోపియన్ సిటీలో షాంగ్-చీ, కాటీలతో కలుస్తుంది. వాళ్లు జాంబీ కెప్టెన్ అమెరికా, స్కార్లెట్ విచ్, ఒకోయే, నామోర్‌లను ఎదుర్కొంటారు. బ్లేడ్ నైట్, ఒక స్వోర్డ్‌తో జాంబీ ఘోస్ట్‌ని కోసే సీన్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. స్పైడర్-మాన్ తన వెబ్స్‌తో జాంబీ హోర్డ్‌ని డీక్యాపిటేట్ చేసే సీన్, యాక్షన్‌ వైబ్‌ని ఇస్తుంది.


సెకండ్ హాఫ్‌లో సర్వైవర్స్ జాంబీ థానోస్‌ని ఎదుర్కొంటారు. ఇతను ఇన్ఫినిటీ గాంట్‌లెట్‌తో ఇంకా డేంజరస్‌గా ఉంటాడు. కమలా టీమ్ ఒక సీక్రెట్ ల్యాబ్‌లో క్యూర్ కోసం వెతుకుతూ, బ్లాక్ విడోస్ టీమ్, స్క్రల్స్‌తో కలిసి జాంబీ అవెంజర్స్‌తో భీకర ఫైట్స్ చేస్తుంది. బ్లేడ్ నైట్, జిమ్మీ వూ, కేట్ బిషప్‌లు కలిసి ఒక ఎపిక్ ఫైనల్ బ్యాటిల్‌లో పాల్గొంటారు. కానీ ఈ యుద్ధంలో చాలా చనిపోతారు. కమలా జర్నీ, ఆమె లీడర్‌గా ఎదగడం, టీమ్ మధ్య బాండింగ్ సిరీస్‌ని ఎమోషనల్‌గా ఉంచుతుంది. బ్లేడ్ నైట్, స్పైడర్-మాన్ సీన్స్ గురించి బజ్ క్రియేట్ అయ్యింది. కమలా టీం ఈ వైరస్ ను కంట్రోల్ చేస్తుందా ? థానోస్‌ చేతిలో చావు దెబ్బ తింటుందా ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Read Also : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×