Ghaati OTT : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఘాటీ(Ghaati). డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా రాబట్టలేకపోవడంతో థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలో విడుదలకు(OTT Release) సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్ధ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)కొనుగోలు చేశారు.
తాజగా అమెజాన్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారక ప్రకటన వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఈ సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతోందని తెలుస్తుంది. ఇలా మరికొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ అనుష్కకు ఒక రకంగా ఇది ఘోర అవమానం లాంటిది అని చెప్పాలి. అనుష్కకు పాన్ ఇండియా స్టార్ డం ఉంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న స్వీటి సినిమా 20 రోజుల్లోనే థియేటర్ల నుంచి తొలగించడం అంటే నిజంగా అవమానమే అని చెప్పాలి.
మరోసారి ప్రభాస్ కు జోడిగా అనుష్క?
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తదుపరి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తారని అభిమానులు భావించారు కానీ ఈమె మాత్రం తన వ్యక్తిగత కారణాల వల్ల పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపదడపా సినిమాలలో నటిస్తున్న అనుష్క కనీసం సినిమా ప్రమోషన్లకు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. ఘాటీ సినిమా తర్వాత అనుష్క తదుపరి ఎలాంటి తెలుగు సినిమాలను ప్రకటించలేదు కానీ ఈమె మాత్రం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2 సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఓటీటీలో అయినా హిట్ కొట్టేనా…
ఇక ఘాటీ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఘాటీస్ అనే అణగారిన వర్గాలకు చెందిన ప్రజల జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వర్గానికి చెందిన ప్రజలను అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ నెట్ వర్క్ లో బలవంతంగా పని చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రజలకు విముక్తి కల్పించడం కోసం షీలావతి (అనుష్క) ఏ విధంగా నాయుడు బ్రదర్స్ (చైతన్య రావు, రవీంద్ర విజయ్)తో పోరాటం చేశారు? ఈ పోరాటంలో అనుష్క ఎలాంటి సంఘటనలోను ఎదుర్కొన్నారు చివరికి ఘాటీస్ కు నాయుడు బ్రదర్స్ నుంచి విముక్తి కల్పించారా? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఇలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సిందే.
Also Read: Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?