BigTV English
Advertisement

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : సోషల్ ఇష్యూపై అనేక సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు, డిఫరెంట్ స్టోరీతో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఫీమేల్ ఫోటిసైడ్ (ఆడపిల్లలను గర్భంలోనే చంపడం) అనే సోషల్ ఇష్యూపై అడ్వెంచర్ స్టోరీగా నడుస్తుంది. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ అయింది. ఆస్కార్ అవార్డ్స్‌కి ఫారిన్ ఫిల్మ్ కేటగరీలో డైరెక్ట్ ఎంట్రీగా పంపబడింది. మిన్స్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆడియన్స్ ఛాయిస్ అవార్డ్ గెలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

“జల్‌పరి: ది డెసర్ట్ మెర్మైడ్” 2012లో విడుదలైన హిందీ డ్రామా ఫిల్మ్. దీనికి నీలా మాధబ్ పాండా దర్శకత్వం వహించారు. ఇందులో లేహర్ ఖాన్, కృషాంగ్ త్రివేది, హర్ష్ మాయర్ లీడ్ రోల్స్‌లో నటించారు. అల్ట్రా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా, 2012 ఆగస్ట్ 31న రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో స్ట్రీమ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

శ్రేయ, సామ్ అనే ఇద్దరు సిటీ పిల్లలు, వాళ్ల తండ్రి దేవ్, అమ్మమ్మతో హర్యానాలోని ఒక ఊరికి వెకేషన్‌కి వస్తారు. వాళ్ళు పచ్చని పొలాలు, చెరువులతో ఉండే ఒక స్వర్గం లాంటి ఊరికి వెళ్తున్నట్లు ఊహించుకుంటారు. కానీ వచ్చాక చూస్తే, ఊరు పొడిగా, డస్టీగా, చెరువులు ఎండిపోయి ఆ ఊరు కనిపిస్తుంది. ఊరి పిల్లలు ఫ్రెండ్లీగా కూడా ఉండరు. శ్రేయ ఒక టామ్‌ బాయ్, గర్ల్ డ్రెస్‌లు వేసుకోదు. తండ్రిని దేవ్ అని పేరుతో పిలుస్తుంది. అంతేకాకుండా ఫుల్ ఎనర్జీతో తిరుగుతుంది. ఊరిలో ఆడపిల్లలు లేరని, భార్యలను కూడా ఇతర స్టేట్స్ నుంచి తెచ్చుకుంటున్నారని, ఇక్కడ చిన్న పిల్లలను తినే మంత్రగత్తె గురించి రూమర్స్ ఉన్నాయని శ్రేయ, సామ్‌కి తెలుస్తుంది. శ్రేయ క్యూరియాసిటీతో, సామ్‌తో కలిసి ఊరి సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి అడ్వెంచర్ స్టార్ట్ చేస్తుంది. వాళ్లు అజితే అనే లోకల్ బాయ్, అతని గ్యాంగ్‌తో ఫ్రెండ్స్ అవుతారు.


శ్రేయ, సామ్ ఊరిలో ఆడపిల్లలు ఎందుకు లేరో తెలుసుకుంటారు. ఫీమేల్ ఫోటిసైడ్ అనే భయంకరమైన సీక్రెట్ బయటపడుతుంది. ఊరిలో ఆడపిల్లలను గర్భంలోనే చంపేస్తున్నారని, ఇది ఒక సోషల్ డిస్క్రిమినేషన్‌గా జరుగుతోందని తెలుసుకుని శ్రేయ షాక్ అవుతుంది. శ్రేయ ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అజితే, శబ్రీతో కలిసి ఊరి పెద్దలతో డిబేట్ చేస్తుంది. ఒక సీన్‌లో, శ్రేయ ఒక లోకల్ స్కూల్‌లో ఆడపిల్లల గురించి స్పీచ్ ఇచ్చే సన్నివేశం ఎమోషనల్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. దేవ్ అతని ఫ్యామిలీ కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఊరి ట్రెడిషన్స్, మూఢనమ్మకాలు వాళ్లను ఆపడానికి ట్రై చేస్తాయి. క్లైమాక్స్‌లో శ్రేయ ధైర్యంతో ఊరిలో చిన్న మార్పుని తేవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నం ఫలిస్తుందా ? ఆ ఊరు మూఢనమ్మకాలతోనే బతుకుతుందా ? ఆడపిల్లలను గర్భంలోనే ఎందుకు చంపుకుంటున్నారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×