BigTV English

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : రియలిస్టిక్ థీమ్, హై-స్టేక్స్ థ్రిల్స్ తో ఒక వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేయడానికి వస్తోంది. ఇందులో జెస్సికా చాస్టెయిన్ ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేటర్‌గా ఆన్‌లైన్ హేట్ గ్రూప్స్‌లోకి చొరబడి, హింసాత్మక ఎక్స్‌ట్రీమిస్ట్‌లను ఆపడం చుట్టూ కథ నడుస్తుంది. ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ, మరోవైపు టెర్రరిస్ట్ లని ఎదుర్కునే జెస్సికా పాత్రకి ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్ తొందర్లోనే స్ట్రీమింగ్ కి రాబోతోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలోకి రాబోతోందంటే

‘ది సావంట్’ 2025లో ఆపిల్ టీవీ+లో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మినీ సిరీస్. మెలిస్సా జేమ్స్ గిబ్సన్ దీనిని రూపొందించారు. ఇందులో జెస్సికా చాస్టెయిన్ సావంట్‌గా, నమ్దీ అసోముఘా, కోల్ డోమన్, జోర్డానా స్పైరో, ట్రినిటీ లీ షిర్లీ, గెస్ట్ స్టార్ పాబ్లో ష్రీబర్ నటించారు. ఈ సిరీస్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఆడియన్స్ అవార్డ్‌కి కూడా నామినేట్ అయింది. ఈ సిరీస్ మొదట 2025 సెప్టెంబర్ 26 రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు. 8 ఎపిసోడ్స్‌తో, IMDbలో 7.8/10 రేటింగ్ పొందిన ఈ సిరీస్ ఆపిల్ టీవీ+లో ఈ నెల చివరిలోగా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీలోకి వెళ్తే

జోడీ గుడ్‌విన్ అనే మహిళ భర్త చార్లీ, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆమె రియల్ జాబ్ ఎవరికీ తెలీదు. ఆమె “ది సావంట్” అనే సీక్రెట్ ఇన్వెస్టిగేటర్. ఆన్‌లైన్ హేట్ గ్రూప్స్‌లోకి చొరబడి, హింసాత్మక ఎక్స్‌ట్రీమిస్ట్‌లను పట్టుకుంటుంది. ఆమె ఆంటీ హేట్ అలయన్స్‌తో కలిసి, FBIకి హెల్ప్ చేస్తూ డేంజరస్ గ్రూప్స్‌ని ట్రాక్ చేస్తుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో, జోడీ ఒక ఆన్‌లైన్ ఫోరమ్‌లో జాయిన్ అయి, జాసన్ అనే ఎక్స్‌ట్రీమిస్ట్‌ని టార్గెట్ చేస్తుంది. ఇతను మాస్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆమె రాత్రంతా కంప్యూటర్ ముందు కూర్చుని, ఫేక్ ఐడెంటిటీతో చాట్ చేస్తూ, అతని ప్లాన్స్ గురించి ఇన్ఫో కలెక్ట్ చేస్తుంది. ఇంట్లో ఆమె పిల్లలు మీవ్, ర్యాన్‌లతో జోడీ సాధారణ అమ్మలా బిహేవ్ చేస్తుంది, కానీ ఆమె జాబ్ వల్ల ఫ్యామిలీ లైఫ్‌లో టెన్షన్స్ వస్తాయి. ఒక సీన్‌లో, జోడీ డిన్నర్ టేబుల్‌లో పిల్లలతో నవ్వుతూ ఉంటే, ఆమె ఫోన్‌లో డేంజరస్ మెసేజ్ వస్తుంది. ఆమె మొహం సీరియస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్స్‌లో, జోడీ ఇంటెలిజెన్స్, ఆమె ఆన్‌లైన్ గేమ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసే స్ట్రగుల్ సిరీస్‌ని ఎంగేజింగ్‌గా ఉంచుతాయి.


కథ నడిచే కొద్దీ జోడీ జాసన్‌ని ట్రాక్ చేస్తూ, అతని గ్రూప్‌లో డీప్‌గా ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె ఫేక్ ఐడెంటిటీ బయటపడే రిస్క్ ఎక్కువవుతుంది. ఆమె ఫ్యామిలీకి కూడా డేంజర్ వస్తుంది. ఒక ఎపిసోడ్‌లో, జోడీ ఆఫ్‌లైన్‌లో జాసన్‌ని కలవాల్సి వస్తుంది, ఇది సిరీస్‌లోనే మోస్ట్ థ్రిల్లింగ్ మూమెంట్. ఆమె భర్త చార్లీ, ఆమె జాబ్ గురించి కొంత తెలుసుకుని, ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ల మధ్య టెన్షన్స్ పెరుగుతాయి. జోడీ పిల్లలు ఆన్‌లైన్ స్క్రీన్స్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటే, ఆమె జాబ్ వల్ల వచ్చే పారనాయిడ్ ఫీలింగ్స్ ఆమెను ఎమోషనల్‌గా బ్రేక్ చేస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో జోడీ ఒక పెద్ద టెర్రరిస్ట్ ప్లాట్‌ని ఆపడానికి స్ట్రగుల్ చేస్తుంది. ఆమె ఐడెంటిటీ దాదాపు బయటపడుతుంది. ఈ భాగంలో జెస్సికా ఇంటెన్స్ నటన, నమ్దీ అసోముఘా సపోర్టింగ్ రోల్, పాబ్లో ష్రీబర్ క్రీపీ ఎక్స్‌ట్రీమిస్ట్ పాత్ర సిరీస్‌ని గ్రిప్పింగ్‌గా మారుస్తాయి. జోడీ టెర్రరిస్ట్ అటాక్ ని ఆపగలుగుతుందా ? తన ఫ్యామిలీతో పాటు చిక్కుల్లో పడుతుందా ? అనేది ఈ సిరిస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×