Mass Jathara: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న వారిలో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన భాను భోగవరపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మాస్ జాతర(Mass Jathara). ఈ సినిమా షూటింగ్ పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమా తరచూ విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే .
రవితేజ, శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్లుగా భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ సమయంలో సినీ కార్మికుల సమ్మె ఉండటం వల్ల సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. తద్వారా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో విడుదల తేదీ తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ లో వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల గురించి తరచూ అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత నాగ వంశీ(Nagavamshi) తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.
దసరా పండుగ రోజు …
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈయన మాస్ జాతర సినిమా విడుదల గురించి ట్వీట్ చేస్తూ.. మాస్ జాతర సినిమా ఎప్పుడు విడుదల చేయబోతున్నామనే విషయాన్ని ఎంతో పవిత్రమైన, శుభప్రదమైన దసరా పండుగ రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇలా సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాగ వంశీ తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
We'll be announcing the release date this Dasara on 2nd Oct… From then on, it’s gonna be back-to-back updates and promotions. Get ready to see our Energetic Mass Maharaaj @RaviTeja_offl garu lighting up the big screens with full-on mass entertainment coming your way..
— Naga Vamsi (@vamsi84) September 24, 2025
ఇక ఇప్పటికే మాస్ జాతర సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా ఎంతో మంచి అంచనాలను పెంచేస్తాయి. ఈ సినిమాలో శ్రీ లీల రవితేజ నటన అద్భుతంగా ఉందని తెలుస్తుంది. ఇక ఇందులో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల కాలంలో రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. రవితేజ అభిమానులు అందరూ కూడా మాస్ జాతర సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకే రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మాస్ జాతర సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!