BigTV English

Comedy Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Movie OTT : సామజవరాగమనా, ఓం భీం బుష్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న హీరో శ్రీవిష్ణు ఈ ఏడాది స్వాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. మొదట విమర్శలు అందుకున్న, తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్లను కూడా అందుకొని బాక్సాఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా కొద్దీ రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ ఓటీటి అప్డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు. స్వాగ్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


 

ఈ స్వాగ్ మూవీకి, హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మీరాజాస్మిన్‌, దక్షా నగార్కర్ , సునీల్ కీలక పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు ఐదు పాత్రల్లో నటించారు. ఇక ఇద్దరు హీరోయిన్లు రీతూ, మీరా జాస్మిన్ లు ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఈ మూవీ ఈ నెల 4 న థియేటర్లలోకి వచ్చింది. శ్రీవిష్ణుతో పాటు రీతూవర్మ నటనకు ప్రశంసలు దక్కాయి. కాన్సెప్ట్ బాగున్నా కన్ఫ్యూజింగ్‌గా దర్శకుడు స్క్రీన్‌పై చూపించాడనే నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎనిమిది కోట్ల వరకు స్వాగ్‌ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతోన్నారు. థియేట్రికల్ రన్‌లో ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.. ఓటీటీ, శాటిలైట్ డీల్‌తో ప్రొడ్యూసర్స్ నష్టాల నుంచి బయట పడ్డారనే టాక్ ను సొంతం చేసుకుంది.


ఇక ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ మూవీ విడుదలైంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్‌గా ఓటీటీ లోకి వచ్చి ఆడియెన్స్‌ ను సర్‌ప్రైజ్ చేసింది.. ఈరోజు ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ల లో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి. 1551 ఏళ్ల క్రితం పురుషులపై ఆధిపత్యం చెలాయించిన వింజమర వంశ రాణి రుక్మిణి దేవి కథేమిటి? పితృస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి శ్వాగణిక మూలపురుషుడు భవభూతి ఏం చేశాడు? ఈ కథలోకి విభూతి ఎలా ఈ కథలోకి ఎలా వచ్చాడు అనేది సినిమా స్టోరీ.. వంశ వృక్షం అనే కాన్సెప్ట్ తో సినిమా స్టోరీ ఉంటుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్‌పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు ఇదే జోనర్ మరో సినిమా చెయ్యనున్నారని సమాచారం.. త్వరలోనే ఈ మూవీ అనౌన్స్మెంట్ రాబోతుందని సమాచారం.. కామెడీ జోనర్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా రాబోతుందని సమాచారం..

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×