OTT Move : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక బెంగాలీ థ్రిల్లర్ సిరీస్, ఓటీటీలో టాప్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ చివరి వరకు ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ కథ ఒక మర్డర్ కేస్‌ను సాల్వ్ చేయడానికి, టైమ్ ట్రావెల్ చేసే ఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ అభిమానులకు ఇది ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సరికొత్త సై-ఫై థ్రిల్లర్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘కాల్ పురుష్’ (Kaal purush) 2024లో వచ్చిన బంగ్లా మర్డర్ మిస్టరీ సై-ఫై వెబ్ సిరీస్. దీన్ని సల్జార్ రహ్‌మాన్ డైరెక్ట్ చేశారు. ఇందులో మిరాజ్ (పోలీసు ఆఫీసర్), షెహ్జాద్ (మిస్టీరియస్ గై), జాహాంగీర్ (మరో పోలీసు) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లతో, IMDb లో 8.8/10 రేటింగ్ పొందింది. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సినిమా 2024 మే 23 నుంచి Chorki ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
ఈ కథ మిరాజ్ అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో స్టార్ట్ అవుతుంది. అతను ధాన్ మొండి అనే లేక్ దగ్గర జరిగిన, ఫారియా అనే అమ్మాయి మర్డర్ కేస్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. మిరాజ్ ప్రస్తుతం పోలీసు జాబ్‌లో సస్పెన్షన్‌లో ఉంటాడు. కానీ ఆ కేస్‌ను మాత్రం వదలడు. ఈ కేసును డీల్ చేయడానికి, అతను షెహ్జాద్ అనే విచిత్రమైన వ్యక్తిని కలుస్తాడు. ఎందుకంటే షెహ్జాద్ దగ్గర ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఉందని, దానితో టైమ్ ట్రావెల్ చేయవచ్చని తెలుసుకుంటాడు. మిరాజ్, షెహ్జాద్ కలిసి ఆ ఇంజెక్షన్ ఉపయోగించి, మర్డర్ జరిగిన రాత్రికి టైమ్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళు ఆ చోటుకి టైమ్ ట్రావెల్ చేస్తూ, మర్డర్ కేస్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్లు టైమ్ లూప్‌లో (అదే రోజు మళ్లీ మళ్లీ రిపీట్) చిక్కుకుంటారు.
ఈ ప్రయాణంలో ఫారియా మర్డర్ ఒక పాత కేస్‌తో కనెక్ట్ అయి ఉందని తెలుస్తుంది. ఈ కేస్‌లో సూపర్ నాచురల్ సీక్రెట్ ఉందనే సూచనలు కనిపిస్తాయి. షెహ్జాద్ సీరం వల్ల వాళ్లు మళ్లీ మళ్లీ టైమ్ ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ప్రతి లూప్‌లో కొత్త క్లూస్ వస్తాయి. కానీ వీళ్ళకు డేంజర్ కూడా పెరుగుతుంది. టైమ్ ట్రావెల్, మర్డర్ మిస్టరీ మిక్స్‌తో ఈ సిరీస్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. మిరాజ్, షెహ్జాద్ టైమ్ లూప్ నుంచి బయటపడటానికి ఫైట్ చేస్తారు. ఈ సమయంలో ఫారియా మర్డర్ వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడుతుంది. ఈ సీక్రెట్ ఏమిటి ? ఫారియా ఎలా చనిపోయింది ? మిరాజ్, షెహ్జాద్ టైమ్ లూప్ నుంచి బయట పడతారా ? అనే విషయాలను, ఈ బెంగాలీ మర్డర్ మిస్టరీ సై-ఫై సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ