OTT Move : సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీటిలో మార్వెల్, డిస్నీ ల నుంచి వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంటాయి. ఈ సినిమాల కోసం చాలా మంది ఎప్పుడెప్పుడా అని కాచుకుని ఉంటారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ లో వచ్చిన ఒక కొరియాన్ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. ఇది సాధారణ మనుషులు సూపర్‌పవర్స్ పొంది, ఒక టీమ్ గా విలన్‌తో ఫైట్ చేసే ఒక ఫన్నీ యాక్షన్ స్టోరీ. సూపర్ హీరో సినిమాలను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘హై-ఫైవ్’ (Hi Five) 2025లో వచ్చిన కొరియన్ యాక్షన్ కామెడీ సినిమా. కాంగ్ హ్యూంగ్-చోల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో యంగ్-చూన్ , గీ-డాంగ్, వాన్-సో, జీ-సుంగ్, బీ-బాం, హ్యో-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 30న కొరియాలో, 2025 జూన్ 20న USలో రిలీజ్ అయ్యింది. 1 గంట 59 నిమిషాల నిడివితో, IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Viki, అమెజాన్ ప్రైమ్ వీడియో, బిల్లీబిలిలో స్ట్రీమింగ్‌లో ఉంది.
ఈ కథ ఒక హాస్పిటల్ లో బాడీ డొనేషన్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ బాడీ ఆర్గాన్స్ (హార్ట్, కళ్లు, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ) 5 మందికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. దీంతో అనూహ్యంగా, ఆ 5 మందికి సూపర్‌పవర్స్ వస్తాయి. ఇందులో మొదటగా వాన్-సో అనే అమ్మాయికి సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ పవర్ తో ఆమె సూపర్ మ్యాన్ లా గాలిలో కూడా ఎగురుతుంది. బరువైన వస్తువులను కూడా ఎత్తగలుగుతుంది. డాంగ్ అనే మరో వ్యక్తికి, కళ్ల ట్రాన్స్‌ప్లాంట్ వల్ల ఎలక్ట్రిక్ విజన్ వస్తుంది. ఇతను చేతులతోనే డివైసెస్ ను కంట్రోల్ చేయగలడు. బీ-బాం అనే అమ్మాయికి, ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ వల్ల గాలి పవర్ వస్తుంది. హ్యో-జిన్ అనే ఆంటీకి లివర్ వల్ల హీలింగ్ పవర్ వస్తుంది. ఇంకో అమ్మాయికి కిడ్నీ వల్ల పవర్ వస్తుంది. వీళ్ళంతా కలిసి ఒక ‘హై-ఫైవ్’ టీమ్ అవుతారు.
ఈ 5 మంది తమ సూపర్‌పవర్స్ తెలుసుకుని, టీమ్‌గా జాయిన్ అవుతారు. కానీ డొనర్ బాడీ నుంచి ప్యాన్‌క్రియాస్ తీసుకున్న యంగ్-చూన్ అనే కల్ట్ లీడర్ కూడా పవర్ పొందాడు. అతనికి ఇతరులలో ఉన్న ఎనర్జీని పొందగలిగే పవర్ వస్తుంది. దీంతో ఆ వ్యక్తి హై-ఫైవ్ టీమ్ పవర్స్ దొంగిలించి, పవర్‌ఫుల్ విలన్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. మొదట్లో హై-ఫైవ్ టీమ్టీ మధ్య గొడవలు వస్తాయి. కానీ వాళ్లు కలిసి యంగ్-చూన్‌ను ఎదుర్కోవాలని డిసైడ్ అవుతారు. ఈ సినిమా ఫన్నీ సీన్స్, యాక్షన్ ఫైట్స్‌తో యమ క్రేజీగా ఉంటుంది. క్లైమాక్స్ లో హై-ఫైవ్ టీమ్, యంగ్-చూన్‌తో బిగ్ ఫైట్ చేస్తారు. వాళ్లు తమ పవర్స్ యూజ్ చేసి, అతని ఎనర్జీ దొంగిలించే పవర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ? వీళ్ళ పవర్స్ ఏమవుతాయి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమానుచూసి తెలుసుకోండి.
Read Also : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?