BigTV English

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు…  ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : ప్రేమ అన్ని సమస్యలను గెలుస్తుందని ఒక కొరియెన్ సినిమాను చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమా కొరియాలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇందులో ఒక అమ్మాయి రాత్రి దెయ్యం లాగా, పగలు మామూలు మనిషిలా మారుతుంటుంది. ఈ విషయం తెలియని ఒక పొరుగు వ్యక్తి ఆమె ప్రేమలో పడతాడు. అ తరువాత ఈ లవ్ స్టోరీ ఫన్నీ సీన్స్ తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఆడియన్స్ కి ఇది ఒక మైండ్ రిలాక్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘ప్రెట్టీ క్రేజీ’ (Pretty Crazy) 2025లో వచ్చిన కొరియన్ రొమాంటిక్ కామెడీ సినిమా. లీ సాంగ్-గ్యూన్ దర్శకత్వంలో, సెన్-జీ (ఇం యూన్-ఆహ్), గిల్-గూ (ఆన్ బో-హ్యూన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2025 ఆగస్టు 13న కొరియాలో రిలీజ్ అయ్యింది. ఇది IMDbలో 6.6/10. రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, బిల్లీబిలి ఓటీటీలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

సెన్-జీ అనే ఒక క్యూట్ అమ్మాయి, కేక్‌లు తయారు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఒక సీక్రెట్ ఉంటుంది. రాత్రి అయితే ఆమె దెయ్యం లాగా వైల్డ్ గా మారిపోతుంది. రాత్రి ఏం చేసిందో ఆమెకు ఉదయం అస్సలు గుర్తు ఉండదు. ఆమె ఫ్యామిలీకి మాత్రమే, ఈ సెక్రెట్ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఈ సమస్యను దాచిపెట్టి, ఆమెను కాపాడుతుంటారు. ఈ సమయంలో గిల్-గూ అనే ఒక వ్యక్తి ఆమె పొరుగు అపార్ట్‌మెంట్‌లోకి వస్తాడు. అతను జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. సెన్-జీని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. సెన్-జీ డే వెర్షన్ చాలా స్వీట్, గిల్-గూ ఆమెతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తాడు. కానీ రాత్రి సెన్-జీ క్రేజీ వెర్షన్‌ను చూసి షాక్ అవుతాడు. సెన్-జీ ఫ్యామిలీ అతన్ని రాత్రి సమయంలో ఆమెను కాపాడమని రిక్వెస్ట్ చేస్తారు.


గిల్-గూ రాత్రి సమయంలో సెన్-జీని గమనిస్తూ ఉంటాడు. ఆమె దెయ్యం లాగా క్రేజీగా ఉంటుంది. ఫన్నీ సీన్స్ తో పాటు, టెన్షన్ పెట్టించే సీన్స్ కూడా వస్తాయి. కానీ పగలు పూట ఆమెతో అతను ప్రేమలో ఉంటాడు. ఇక ఆమెను సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. సెన్-జీ శాపం గురించి తెలుసుకుంటాడు. అది ఆమె పాస్ట్‌తో కనెక్ట్ అయి ఉందని కనుక్కుంటాడు. సెన్-జీ తండ్రి, సోదరి కూడా ఈ సమస్యను దాచి, ఆమెను కాపాడుతున్నారు. గిల్-గూ, సెన్-జీ మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ రాత్రి వెర్షన్ వల్ల ఫన్నీ, సిల్లీ గొడవలు వస్తాయి. గిల్-గూ ఆమె శాపాన్ని తీసేయడానికి మార్గాలు వెతుకుతాడు. ఈ సమయంలో సెన్-జీతో అతని బంధం బలపడుతుంది. సినిమా మొదట ఫన్నీగా, తర్వాత ఎమోషనల్‌గా మారుతుంది.

కథ నడిచే సమయంలో గిల్-గూ ఆమెకు ఈ శాపం ఎందుకు వచ్చిందో పూర్తిగా తెలుసుకుంటాడు. అతను ఆమెను సేవ్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తాడు క్లైమాక్స్‌లో ఈ కథకి ఆసక్తికరమైన ముగింపు వస్తుంది. ఈ ముగింపు ఎలా ఉంటుంది ? సెన్-జీ రాత్రి పూట దెయ్యంగా ఎందుకు మారుతోంది ? ఆమెకు ఉన్న శాపం ఏమిటి ? ఆమె గతం ఏమిటి ? ఈ శాపం నుంచి సెన్-జీ బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ కొరియన్ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అయ్యయ్యో ఈ లవ్ స్టోరీ మామూలుగా లేదే… ఎంట్రీనే ఊర మాస్… క్లైమాక్స్ ఊహించలేం

Related News

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

Big Stories

×