BigTV English

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

OTT Movie : థ్రిల్లర్ జానర్లో ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఓటీటీలో కూడా థ్రిల్లర్ స్టోరిలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ కథ కొత్త హౌస్‌లోకి వెళ్లిన ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లోకి సెల్లార్ డోర్ తెరవకూడదనే కండిషన్‌తో వెళతారు. కానీ ఈ రూల్ బ్రేక్ చేయడంతో, భయంకరమైన సమస్యలు వస్తాయి. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ కి, అందరి ఫ్యూజులు అవుట్ అవుతాయి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘సెల్లార్ డోర్’ (Cellar door) 2024లో వచ్చిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. వాన్ స్టీన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సెరా (జోర్డానా బ్రూస్టర్), జాన్ (స్కాట్ స్పీడ్‌మన్), ఎమ్మెట్ (లారెన్స్ ఫిష్‌బర్న్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 31న థియేటర్లలో వచ్చింది. 1 గంట 37 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 5.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

సెరా, జాన్ అనే జంట జీవితంలో సంతోషంగా ఉంటారు. సెరా ప్రెగ్నెన్సీ కూడా అవుతుంది. ఇక వీళ్ళు మరింత ఆనందంగా ఉన్నారనుకున్న సమయంలో, సెరాకి ఉన్నట్టుండి ప్రెగ్నెన్సీ పోతుంది. వాళ్లు బేబీని కోల్పోయి ఇప్పుడు చాలా బాధలో ఉంటారు. ఆతరువాత కొత్త జీవితం కోసం, పోర్ట్‌ ల్యాండ్ కి వెళ్తారు. వాళ్లు అందమైన, చవకైన హౌస్ కోసం చూస్తారు. కానీ వీళ్ళ బడ్జెట్ కి అలాంటి ఇళ్ళు దొరకడం కష్టంగా ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, వాళ్లను ఎమ్మెట్ అనే విచిత్రమైన మనిషి ఇంటికి తీసుకెళ్తుంది. ఎమ్మెట్ వాళ్లను బాగా రిసీవ్ చేసుకుంటాడు. ఆ రాత్రి అక్కడే ఉండమంటాడు. మర్నాడు ఎమ్మెట్ ఒక లెటర్ రాసి వెళ్లిపోతాడు. హౌస్ వాళ్లకు తక్కువ ధరకే ఇస్తున్నానని, కానీ ఆ ఇంట్లో సెల్లార్ డోర్ ఎప్పుడూ తెరవకూడదని కండిషన్ పెడతాడు. సెరా, జాన్ హ్యాపీగా హౌస్‌లోకి మారతారు. కానీ సెల్లార్ లో ఉండే ఆ గది గురించి ఆలోచిస్తారు.


సెరా ఒక మ్యాథమెటిషియన్, జాన్ ఒక ఆర్కిటెక్ట్. బేబీ కోల్పోవడం వల్ల ఇప్పుడు సెరా బాధలో ఉంటుంది. జాన్ జాబ్‌లో బిజీగా ఉంటాడు. అయితే డోర్ గురించి జాన్ క్యూరియాస్ గా ఉంటాడు. కానీ సెరా, ఎమ్మెట్ రూల్ ఫాలో చేయాలని చెబుతుంది. హౌస్‌లో విచిత్రమైన సంఘటనలు స్టార్ట్ అవుతాయి. జాన్ ఆ సీక్రెట్ గురించి, మునుపటి ఓనర్ పాల్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తాడు. పాల్ ఒక షాకింగ్ సీక్రెట్ చెప్తాడు. ఈ హౌస్ లోపల ఉన్నవాళ్లను, అక్క ఉండే ఒక దుష్ట శక్తి డెస్ట్రాయ్ చేస్తుందని ట్విస్ట్ ఇస్తాడు. జాన్ ఆ డోర్ తెరవాలని డిసైడ్ అవుతాడు. సెరా ఆపడానికి ట్రై చేయడంతో కథలో టెన్షన్ పెరుగుతుంది.

జాన్ సెల్లార్ డోర్ లాక్‌ను బ్రేక్ చేయడానికి వెళ్తాడు. అయితే సెరా అతన్ని ఆపడానికి ఒక రాడ్ తో కొట్టి అన్‌కాన్షస్ లోకి వెళ్ళేలా చేస్తుంది. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఎమ్మెట్ తన వైఫ్, డాటర్‌ను చంపి, బేస్‌మెంట్‌లో దాచినట్లు తెలుస్తుంది. ఈ హౌస్ లో ఒక శాపం ఉందని అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సీక్రెట్స్ ని బయటకి తీసి, వాళ్లను నాశనం చేస్తుందని తెలుస్తుంది. ఈ సమయంలో సెరా సెక్రెట్ ఒకటి బయట పడుతుంది. దీని వల్లే ఆమె జాన్ ను రాడ్ తో కొడుతుంది. ఆ సీక్రెట్ తెలిసి జాన్ బిత్తరపోతాడు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ఈ మలుపు ఏమిటి ? ఆ హౌస్ అసలు సీక్రెట్ ఏమిటి ? సెరా దాచిన సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

Related News

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

Big Stories

×