E-Paper
Advertisement

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!
Advertisement

Baahubali Movie: బాహుబలి మూవీ లవర్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ షాకిచ్చింది. ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించింది. నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి మూవీ కనిపంచకపోవడంతో మూవీ లవర్స్‌ అంత షాక్‌ అవుతున్నారు. దీనికి కారణమేంటో ఇక్కడ చూద్దాం!

Advertisement

తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించేలా చేసిన చిత్రం ‘బాహుబలి‘. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెలుగు సినిమాకు భాష హద్దులు చెరిపిసిన చిత్రమిది. పాన్‌ ఇండియా ట్రెండ్‌కి శ్రీకారం చూడుతూ.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాసింది. ఇండియన్‌ సినీ చరిత్రలో.. బాహుబలి సినిమా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ పేరు ఇంటర్నేషనల్‌ వేదికలపై మారుమ్రోగింది. ప్రభాస్‌, రానా, అనుష్కల క్రేజ్‌ను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లింది.

బాహుబలికి పదేళ్లు..

ఇక జక్కన్న దర్శకత్వానికి, విజన్‌కి హాలీవుడ్‌ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. అలా హాలీవుడ్‌ ఇండస్ట్రీ బాహుబలి తెలుగు పరిశ్రమ వైపు తిప్పాడు జక్కన్న. ఇక బాక్సాఫీసు వద్ద బాహుబలి సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. రెండు భాగాలతో వరుసగా ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. అప్పటి వరకు తెలుగు పరిశ్రమను చిన్న చూపు చూసి బాలీవుడ్‌ సైతం టాలీవుడ్‌ ముందు తలవంచింది. తెలుగు సినీ పరిశ్రమకు అంతటి ఘనకీర్తి తెచ్చిపెట్టిన బాహుబలి విడుదలయ్య పదేళ్లు పూర్తి చేసుకుంది. 2025తో ఈ సినిమాకు పదేళ్లు. ఈ క్రమంలో మూవీ టీం బాహుబలి సెలబ్రేషన్స్‌ జరుపుకుంటుంది.

Advertisement

Also Read: Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్‌పై తండ్రి ఎమోషనల్‌

నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం

ఇందులో భాగంగా మూవీని రీ రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలను కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో అక్టోబర్‌ 31న రీ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై మూవీ మేకర్స్‌ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ నుంచి ఈ సినిమాను తొలగించింది. మరి రీ రిలీజ్‌ తర్వాత మళ్లీ బాహుబలి ఓటీటీకి వస్తుందా? రాదా అనేది తెలియాల్సి ఉంది. కానీ, గత పదేళ్లుగా ఓటీటీ సందడి చేస్తున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ డిలిట్‌ చేయడంతో మూవీ లవర్స్‌ అంత అసహానికి లోనవుతున్నారు. ఇక అసలు విషయం తెలిసి ఫ్యాన్స్‌ కూల్‌ అవుతున్నారు. కాగా బాహుబలి మూవీని నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ఫస్ట్‌ పార్ట్‌ని 2015లో విడుదల చేశారు. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా బాహుబలి: ది కన్‌క్లూజన్‌ పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కించి 2017లో విడుదల చేశారు. యాక్షన్‌, ఫాంటసీ డ్రామా వచ్చిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, అడవి శేష్‌, తమన్నా వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అందించిన ఈ కథను జక్కన తనదైన విజన్‌తో అద్బుతంగా తెరపై ఆవిష్కరించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×