OTT Movie : అమ్మాయి, డబ్బు చుట్టూనే ఈ రోజుల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సినిమాలలో కూడా ఈ కంటెంట్ నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆమె భార్యగా, వేశ్యగా, ప్రియురాలిగా ఉంటూ, ఒక షాకింగ్ ట్విస్ట్ తో అందరికీ పిచ్చెక్కిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ఈ టివి విన్ (ETV Win) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వైఫ్ ఆఫ్’ ( Wife off). 2025లో విడుదలైన ఈ సినిమాకు భాను యేరబంది దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీ గురుగుబెళ్ళి (అవని), అభినవ్ మణికంఠ (అభి), నిఖిల్ గాజుల (రామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి శ్వేత, ప్రసాద్ రొంగల, వీర మనోహర్, కిరణ్ పుటకల తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, ప్రణీత్ సంగీతం, సాయి కృష్ణ గనల ఎడిటింగ్‌తో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ టివి విన్ (ETV Win) OTT ప్లాట్ ఫామ్‌లో 2025 జనవరి 23న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
అవని సినీనటి కావాలని కలలు కంటూ ఉంటుంది. ఆమె షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అభితో ప్రేమలో పడుతుంది. వీళ్ళు ప్రేమించుకుంటున్న సమయంలో, కుటుంబ పరిస్థితుల కారణంగా అవని తన మామయ్య కొడుకు రామ్ ను వివాహం చేసుకోవలసి వస్తుంది. అయితే రామ్ ఒక దుర్మార్గుడు, హింసాత్మకంగా మారతాడు. అవనిని శారీరకంగా, మానసికంగా హింసిస్తాడు. ఆమె కళ్ళ ముందే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. ఆమెను తీవ్రంగా కొట్టి, ఐస్ బాక్స్ లో పెడతాడు. ఈ దుర్భర జీవితంలో చిక్కుకున్న అవని, ఒక రోజు తన భర్త రామ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుంటుంది. గందరగోళంలో ఉన్న ఆమె, సహాయం కోసం అభిని సంప్రదిస్తుంది. అయితే అవని గతంలో వేశ్యావృత్తిలో ఉందనే పుకార్లు, రామ్ మరణంలో ఆమె పాత్ర పై సందేహాలు మొదలవుతాయి.
సినిమా నాన్-లీనియర్ నరేషన్‌తో మొదలవుతుంది. ఇప్పుడు అవని రాత్రిపూట రోడ్డు మీద వర్కింగ్ గర్ల్ గా కనిపిస్తూ, ఒక వ్యక్తితో ఎవరూ లేని ప్లేస్‌కు వెళ్తుంది. అక్కడ ఆమె వేశ్యగా గడుపుతూ, తన జీవిత కథను చెప్పడం ద్వారా ఫ్లాష్‌బ్యాక్‌లు మొదలవుతాయి. అవని, అభి మధ్య ప్రేమ, ఆమె బలవంతంగా రామ్‌తో వివాహం, రామ్ దుర్మార్గపు స్వభావం బయటికి వస్తాయి. అవని వేశ్యావృత్తిలోకి ఎందుకు దిగింది, రామ్ మరణం వెనుక నిజం ఏమిటి అనే ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి. క్లైమాక్స్‌లో అవని వేశ్యావృత్తి వెనుక ఒక రహస్య ఎజెండా ఉందని, ఇది రామ్ హింసకు, ఆమె జీవితంలో జరిగిన నష్టాలకు ప్రతీకారంతో ముడిపడి ఉందని బయటపడుతుంది. చివరికి రామ్ ను చంపింది ఎవరు ? ఎలా చనిపోయాడు ? అవని వేశ్యగా ఎందుకు మారింది ? అభి పాత్ర ఇందులో ఎంత ఉంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రేమతో మగాళ్లని వేధించే సైకో లేడీ… వలలో చిక్కారో… సింగిల్స్ కి మంచి స్టఫ్ ఉన్న మూవీ