BigTV English

Thammudu Film: తమ్ముడు ఫస్ట్ ఛాయిస్ నితిన్ కాదా.. ఆ హీరో రిజెక్ట్ చేస్తేనే చాన్సా?

Thammudu Film: తమ్ముడు ఫస్ట్ ఛాయిస్ నితిన్ కాదా.. ఆ హీరో రిజెక్ట్ చేస్తేనే చాన్సా?

Thammudu Film:టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin)గత కొంతకాలంగా వరుస సినిమాల ద్వారా బాక్సాఫీస్ తో యుద్ధానికి దిగుతున్నప్పటికీ ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇటీవల రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ సినిమాతో మరోసారి నిరాశను ఎదుర్కొన్నారు. ఇలా హిట్ సినిమాలు లేకపోయినా ఎంతో కాన్ఫిడెన్స్ తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. త్వరలోనే నితిన్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నటించిన తమ్ముడు(Thammudu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్క తమ్ముడి సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.


నానితో తమ్ముడు..

ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత దిల్ రాజు (Dil Raju)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దిల్ రాజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత ఈయన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా కథ వేణు శ్రీరామ్ ముందుగా నితిన్ వద్దకు కాకుండా హీరో నాని(Nani) వద్దకు తీసుకెళ్లారట.


వరస ప్రాజెక్టులతో నాని బిజీ…

ఇలా నానిని అప్రోచ్ కావడంతో నాని మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయటానికి ఆలస్యం అవుతుందని తెలియచేశారట. ఇలా ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా సినిమా చేయటం ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలోనే వేణు శ్రీరామ్ నితిన్ వద్దకు ఈ సినిమా కథను తీసుకువెళ్లడంతో నితిన్ ఈ సినిమాకు కమిట్ అయ్యారని దిల్ రాజు తెలిపారు. ఒకవేళ నానితో కనుక ఈ సినిమా చేసి ఉంటే గతంలో నాని నటించిన ఎంసీఏ సినిమాకు సీక్వెల్ తరహాలో ఉంటుందని గతంలో దిల్ రాజు తెలిపారు కానీ ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదని తెలిపారు.

పాన్ ఇండియా హీరోలతో సినిమా…

ఇలా నాని ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నితిన్ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది. ఇక జులై 4వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా నితిన్ కు ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి లయ(Laya) ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె నితిన్ కు అక్క పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక దిల్ రాజు తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా తెలిపారు. త్వరలోనే తమ నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ ప్రాజెక్టు రాబోతుందని, ఈ సినిమాను 2027 లేదా 28లో విడుదల చేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అల్లు అర్జున్, చరణ్, తారక్ వంటి హీరోలతో సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్న కూడా ఎదురవడంతో ఇండస్ట్రీ అనేది ఒక సైకిల్ లాంటిదని తప్పకుండా ఈ హీరోలు అందరితో కూడా సినిమాలు ఉంటాయని దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: Naga Chaitanya: శోభిత గురించి సమంతకు చైతూ ముందే చెప్పాడా.. వీడియో వైరల్!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×