BigTV English

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : సస్పెన్స్, డ్రామా, కొన్ని షాకింగ్ ట్విస్ట్‌లతో ఎంగేజింగ్ థ్రిల్ ఇచ్చే సినిమా చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చూసేయండి. ఇది ఒక మాజీ భార్య తన భర్త ఫియాన్సీ జీవితాన్ని నాశనం చేయడానికి చేసే ఒక డేంజరస్ అబ్సెషన్ స్టోరీ. ఈ సినిమా పేరు ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అన్‌ఫర్గెటబుల్’ (Unforgettable) అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో డెనిస్ డి నోవి డైరెక్టోరియల్ డెబ్యూ, రొసారియో డాసన్ (జూలియా), కేథరిన్ హీగల్ (టెస్సా), జియోఫ్ స్టల్ట్స్ (డేవిడ్), ఇసాబెల్లా రైస్ (లిలీ), చెరిల్ లాడ్ (లవీ) నటించారు. ఇంగ్లీష్ ఆడియోతో తెలుగు, స్పానిష్ సబ్‌టైటిల్స్ తో Amazon Prime Videoలో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది. 1 గంట 40 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.1/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళ్తే

జూలియా బ్యాంక్స్ ఒక ఆన్‌లైన్ స్టోరీటెల్లింగ్ వెబ్‌సైట్ ఎడిటర్. తన ఫియాన్సీ డేవిడ్ కన్నోవర్ , అతని కూతురు లిలీతో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి కాలిఫోర్నియాకి మూవ్ అవుతుంది. జూలియాకి మైఖేల్ వర్గాస్ అనే అబ్యూసివ్ ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. డేవిడ్ మాజీ భార్య టెస్సా కన్నోవర్, ఒక అబ్సెసివ్ మహిళ. డివోర్స్ తర్వాత ఇంకా డేవిడ్‌ని వదులుకోలేకపోతుంది. టెస్సా, జూలియా ఫోన్‌ని స్టీల్ చేసి, ఆమె పర్సనల్ ఫోటోలు, రెస్ట్రైనింగ్ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకుంటుంది. జూలియా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, మైఖేల్‌తో అసభ్య మెసేజెస్ పంపుతుంది. టెస్సా, డేవిడ్ గ్రాండ్‌మదర్ రింగ్, జూలియా ప్యాంటీస్, డేవిడ్ వాచ్‌ని స్టీల్ చేసి, వాటిని మైఖేల్‌కి పంపుతుంది. జూలియా ఎఫైర్ చేస్తోందని డేవిడ్‌కి అనుమానం కలిగిస్తుంది. ఒక ఫార్మర్స్ మార్కెట్‌లో, లిలీ జూలియాతో ఉండగా, టెస్సా ఆమెను తీసుకెళ్లి, జూలియా అసమర్థమైన స్టెప్‌మదర్ అని డేవిడ్‌కి చెబుతుంది. లిలీ హార్స్‌బ్యాక్ రైడింగ్‌లో భయపడుతుందని జూలియా గమనించి, ఆమెను ఇంటికి తీసుకెళ్తుంది. ఇది టెస్సాని కోప్పడేలా చేస్తుంది.

Read Also : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

టెస్సా, లిలీ జుట్టుని కత్తిరించి, జూలియాతో గొడవ పడుతుంది. తర్వాత తనను తాను మెట్లపై నుండి పడేసుకుని, జూలియా తోసేసిందని నటిస్తుంది. జూలియా ఫ్రెండ్ అలీతో కలిసి, టెస్సా చిన్నతనంలో తన తండ్రి ఇంటిని కాల్చిన విషయం తెలుసుకుంటుంది. టెస్సా, జూలియా పేరుతో మైఖేల్‌ని ఇంటికి రప్పిస్తుంది. అతను జూలియాని అటాక్ చేస్తాడు. జూలియా కిచెన్ నైఫ్‌తో అతన్ని గాయపరుస్తుంది. కానీ టెస్సా బయట వెయిట్ చేసి, మైఖేల్‌ని చంపి, జూలియాని ఫ్రేమ్ చేస్తుంది. డిటెక్టివ్ పోప్ జూలియాని క్వశ్చన్ చేస్తాడు, కానీ ఆమె రిలీజ్ అవుతుంది. డేవిడ్, టెస్సా ఇంట్లో బర్న్డ్ గ్లోవ్స్, రింగ్ చూసి, ఆమె ఫ్రేమింగ్ గురించి తెలుసుకుంటాడు. జూలియా, లిలీని సేవ్ చేసి, టెస్సాతో ఫైట్ చేస్తుంది. టెస్సా తన బ్లీడింగ్ ఫేస్‌ని మిరర్‌లో చూసి, లిలీ పిక్చర్‌ని చూస్తూ, తనని తాను కత్తితో పొడుచుకుని చనిపోతుంది. అయితే క్లైమాక ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? నిజంగానే టెస్సా చనిపోతుందా ? జూలియా, డేవిడ్ తో సంతోషంగా ఉంటుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : ఫన్ కోసం ఆడిన గేమ్ రియల్ లైఫ్ లోకి… ప్రతీ మాస్క్ వెనుక ఓ నిజం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

Big Stories

×