BigTV English

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie :  పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : ప్రేమించే వయసులో తప్పు చేస్తే ఎలావుంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఒక కాలేజీ స్టూడెంట్ ఊహించని విధంగా తండ్రి అవుతాడు. ఆతరువాత పేరెంట్‌గా మారి, తన కలలు, బాధ్యతల మధ్య ఇబ్బందులు పడతాడు. లైఫ్ ని లీడ్ చేయాల్సిన సమయంలో బిడ్డని చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సినిమాలు ఒక మంచి మెసేజ్ ను కూడా ఇస్తాయి. ఎందుకంటే జీవితంలో టీనేజ్ సమయం చాలా విలువైనది. ఒక్క మిస్టేక్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. దీనిని ఎవరైనా చూడకపోతే, ఓటీటీలో ఓ లుక్ వేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఆహాలో స్ట్రీమింగ్

‘పాపా’ (Papa) ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా. దీనికి గణేష్ K బాబు దర్శకత్వం వహించారు. ఇందులో Kavin, K. భాగ్యరాజ్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది థియేటర్‌లలో 2025 జనవరి 3న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో Kavin నటనకు, గణేష్ డైరెక్షన్‌కు ప్రశంసలు వచ్చాయి.


స్టోరీ ఏమిటంటే

అర్జున్ ఒక కాలేజీ స్టూడెంట్. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. అతను తన స్నేహితురాలు ప్రియతో ప్రేమలో పడతాడు. కానీ ఊహించని ట్విస్ట్‌లో ప్రియ గర్భవతి అవుతుంది. ప్రియ తల్లిదండ్రులు ఈ రిలేషన్‌షిప్‌ని ఒప్పుకోకపోవడంతో, ఆమె అర్జున్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. కానీ ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, ఆ బిడ్డను అర్జున్‌కి అప్పగిస్తుంది. అర్జున్ ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి అనుకి తండ్రిగా, తన కలలను పక్కన పెట్టి, ఆమెను పెంచే బాధ్యత తీసుకుంటాడు. అతని తండ్రి రామస్వామి ఒక రిటైర్డ్ టీచర్. అర్జున్‌కి సపోర్ట్‌గా నిలబడతాడు. కానీ సమాజం, ఫైనాన్షియల్ ప్రెషర్స్ అర్జున్‌ని టెస్ట్ చేస్తాయి. అర్జున్ ఫ్రెండ్ సందీప్ అతనికి కొన్ని సినిమా ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్ ఇస్తాడు. కానీ అర్జున్ తన బిడ్డ కోసం టైమ్ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది.

Read Also : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

అర్జున్ అనుని చూసుకుంటూ, పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ బతుకుతాడు. అను పెరిగే కొద్దీ, ఆమె తల్లి గురించి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది. అర్జున్‌కి ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఈ మధ్యలో ప్రియ తిరిగి వస్తుంది. తన బిడ్డను చూసుకోవాలని అనుకుంటుంది. కానీ అర్జున్, అను మధ్య ఏర్పడిన బంధం వల్ల ప్రియతో రీకనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. రామస్వామి తన అనుభవంతో, అర్జున్‌కి ఫ్యామిలీ విలువల గురించి నేర్పిస్తాడు. అతను ప్రియతో కలిసి అనుని పెంచాలని సలహా ఇస్తాడు. క్లైమాక్స్‌లో, అర్జున్ తన సినిమా కలను ఒక షార్ట్ ఫిల్మ్‌తో సాకారం చేస్తాడు. అది అనుతో తన జర్నీ ఆధారంగా ఉంటుంది. ఇది ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ ను కూడా గెలుస్తుంది. చివరికి అర్జున్, ప్రియ కలుస్తారా ? విడిపోతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×