OTT Movie : కుల వివక్షఎంత దారుణంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దీని గురించి చెప్పుకుంటూ పొతే మాటలు సరిపోవు. అయితే దీని గురించి గట్టి సందేశం ఇస్తూ ఒక కన్నడ మూవీ రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఒక గ్రామంలో హెయిర్‌కట్ కోసం వెళ్లిన ఒక దళిత యువకుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ కథ కుల వివక్ష, ఎమోషన్స్, హార్ట్‌హిట్టింగ్ క్లైమాక్స్‌తో ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘హెబ్బులి కట్’ (HebbuliCut) 2025లో వచ్చిన కన్నడ సోషల్ డ్రామా సినిమా. దీనిని భీమ రావ్ డైరెక్ట్ చేశాడు. సారా ఫిల్మ్స్, KRG స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో మౌనేష్ నటరంగ (గోపి), అనన్య నీహారిక (రాజేశ్వరి), మహదేవ్ హడపడ్ (గంగాధర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 ఆగస్టు 8 నుండి Sun NXTలో స్ట్రీమింగ్‌లో ఉంది. IMDbలో ఈ సినిమా 7.2/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళితే
కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో గోపీ (మౌనేష్ నటరంగ) అనే దళిత యువకుడు, తన కాలేజీ ఫంక్షన్ కోసం స్టైలిష్ హెయిర్‌కట్ చేయించుకోవడానికి ఊర్లోని ఒక సెలూన్‌కి వెళ్తాడు. సెలూన్ ఓనర్ గంగాధర్ (మహదేవ్ హడపడ్) ఊరి పెద్ద కులం వాడు. గోపీ కులం తెలిసి అతనికి హెయిర్‌కట్ చేయడానికి నిరాకరిస్తాడు. దళితులకు కట్ చేయడం తన “మర్యాద”కి విరుద్ధమని చెబుతాడు. గోపీ, తన స్నేహితుడు రాజు సహాయంతో, ఈ అవమానాన్ని ఎదుర్కొని, గ్రామంలోని కుల వివక్షపై పోరాడాలని డిసైడ్ అవుతాడు. గోపీ సోదరి రాజేశ్వరి (అనన్య నీహారిక) ఒక స్కూల్ టీచర్, అతనికి సపోర్ట్‌గా నిలబడి, సమాజంలో మార్పు తేవాలని ప్రోత్సహిస్తుంది.
Read Also : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
గోపీ తన తల్లి గౌరమ్మ (ఉమా YG)తో కలిసి, గ్రామ పెద్దలతో ఈ వివక్ష గురించి మాట్లాడతాడు. కానీ వాళ్లు గంగాధర్‌కి సపోర్ట్ చేస్తారు.గోపీ, రాజేశ్వరి, రాజు కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. ఈ క్యాంపెయిన్‌లో గోపీ కథ వైరల్ అవుతుంది. ఊర్లో యువత గోపీకి సపోర్ట్‌గా నిలబడతారు. గంగాధర్ సెలూన్‌కి బాయ్‌కాట్ జరుగుతుంటే, తన తప్పుని తెలుసుకుంటాడు. కానీ ఊరి పెద్దల ఒత్తిడితో మళ్లీ వెనక్కి తగ్గుతాడు. క్లైమాక్స్‌లో గోపీ గ్రామ సభలో గంగాధర్‌ని ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తాడు. ఒక హెయిర్‌కట్ ద్వారా కుల వివక్షను ఎదిరిస్తాడు. ఈ ఘటన గ్రామంలో మార్పును తెస్తుంది. చివరికి గంగాధర్ తన తప్పును తెలుసుకుని గోపీకి హెయిర్‌కట్ చేస్తాడా ? కుల వివక్ష చూపిస్తాడా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.