OTT Movie : సైన్స్ ఫిక్షన్ స్టోరీ, సైకలాజికల్ ట్విస్ట్‌లతో మైండ్ బెండింగ్ అయ్యే ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ లేపుతోంది. ఈ స్టోరీ 1899లో యూరోప్ నుండి న్యూయార్క్‌కి వెళ్లే షిప్‌లోని వలసదారుల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో చాలా ట్విస్ట్‌లు, రహస్యాలు కూడా ఉంటాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘1899’ 2022లో వచ్చిన జర్మన్ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. దీనిని జాంట్జే ఫ్రీస్, బరాన్ బో ఓడార్ రూపొందించారు. ఇందులో ఎమిలీ బీచమ్ (మౌరా ఫ్రాంక్లిన్), అన్యూరిన్ బర్నార్డ్ (డానియల్ సోలస్), ఆండ్రియాస్ పీట్ష్‌మన్ (ఎయ్క్ లార్సెన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2022 నవంబర్ 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 8 ఎపిసోడ్‌లతో (50-62 నిమిషాలు) ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, పోలిష్, జర్మన్, డానిష్, పోర్చుగీస్ ఆడియోలతో అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 7.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
1899లో కెర్బెరోస్ అనే స్టీమ్‌షిప్‌లో యూరోప్ నుండి న్యూయార్క్‌కి వెళ్లే వలసదారులు, వివిధ దేశాల నుండి వచ్చి, కొత్త జీవితం కోసం ప్రయాణిస్తుంటారు. ప్రతి ఒక్కరికీ వారి స్వంత రహస్యాలు, గతంలో జరిగిన సంఘటనలు ఉంటాయి. వీళ్లంతా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి “ప్రొమిథియస్” అనే మరో ఓడ కనిపిస్తుంది. ఇది కొన్ని నెలల క్రితం అదృశ్యమైన ఓడ. ఈ రెండు ఓడల మధ్య జరిగే సంఘటనలు, అనుమానాలు, రహస్యాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ప్రయాణికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తమ గతంతో పోరాడుతూ, ఈ ఓడలో జరుగుతున్న వింత సంఘటనలను ఛేదించడానికి ప్రయత్నిస్తారు.
Read Also : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు
కథ ముందుకు సాగే కొద్దీ, ఓడ ప్రయాణం అనుమానాస్పదంగా మారుతుంది. సమయం, స్థలం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రతి పాత్రకు సంబంధించిన రహస్యాలు బయటపడుతూ, కథలో ఊహించని మలుపులు వస్తాయి. ఇది కేవలం ఓడ ప్రయాణం కాదు, ఒక పెద్ద రహస్యానికి సంబంధించిన కథ అని తెలుస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అసలు ఈ షిప్ ఎక్కడికి వెళ్తుంది? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి ? షిప్ లో ఉన్నవాళ్లు ఏమవుతారు ? క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.