OTT Movie : ఒక హాలీవుడ్ హారర్-థ్రిల్లర్ సినిమా డిఫరెంట్ స్టోరీతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కిల్లర్స్ లైవ్ మర్డర్స్ చేస్తుంటారు. వీళ్ళు అలా ఎందుకు చేస్తున్నారనేది ఈ స్టోరీ. ఇందులో షాకింగ్ ట్విస్టులు, బెదరగొట్టే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
ట్యూబీలో స్ట్రీమింగ్
‘ది డీప్ వెబ్: మర్డర్‌షో’ (The Deep Web: Murdershow) కెనడియన్ హారర్-థ్రిల్లర్ సినిమా. దీనికి డాన్ జాకరీ దర్శకత్వం చేశాడు. ఇందులో ఐడెన్ హోవార్డ్ (ఈథన్), కిమీ అలెగ్జాండర్ (కేట్), బ్రెండన్ ఫ్లెచర్ (షాడో మంకీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జులై 9 నుంచి ఇంగ్లీష్ ఆడియోతో తెలుగు, స్పానిష్, ఫ్రెంచ్ సబ్‌టైటిల్స్ తో ట్యూబీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 24 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 4.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
ఈథన్ ఒక ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్. తన సోదరి క్లేర్ మర్డర్ వెనుక నిజాన్ని కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. క్లేర్ మరణం ఒక డీప్ వెబ్ సైట్ “మర్డర్‌షో”తో లింక్ అయి ఉందని అతను తెలుసుకుంటాడు. ఈథన్ తన స్నేహితురాలు కేట్ తో కలిసి, హాకర్ షాడో మంకీ సహాయంతో డీప్ వెబ్‌లోకి డైవ్ చేస్తాడు. డిటెక్టివ్ సాచక్ ఈథన్ పాడ్‌కాస్ట్‌ని ద్వేషిస్తూ, అతని ఇన్వెస్టిగేషన్‌ని సీరియస్‌గా తీసుకోడు. ఈథన్, కేట్ ఒక “రెడ్ రూమ్” సైట్‌లోకి ఎంటర్ అవుతారు. అక్కడ గ్నార్లీ ది క్లౌన్, డాక్సీ అనే కిల్లర్లు లైవ్‌స్ట్రీమ్‌లో హత్యలు చేస్తుంటారు. ఇక ఈథన్ సోదరి మరణానికి ఈ సైట్ కారణమని కన్ఫర్మ్ అవుతుంది. కానీ అతను సైట్‌లోకి ఎంటర్ అయినప్పుడు, కిల్లర్లు అతన్ని టార్గెట్ చేస్తారు. ఈథన్ ఇంట్లో ఒక బ్లాక్ ప్యాకేజ్, త్రిభుజ సింబల్‌తో ఒక లేఖ అందుతుంది. అది మర్డర్‌షో నుండి వచ్చిన థ్రెట్.
Read Also : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్