OTT Movie : ఒకప్పుడు తెలుగు సినిమాలనే టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా చూసేవాళ్ళు. అయితే కాలంతో పాటు పరిస్థితులు కూడా మారిపోయాయి. ప్రీతీ భాషమీదా సినిమా పరంగా పట్టు పెంచుకుంటున్నారు. సినిమాలను ఒక అవగాహనతో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళయాళ సినిమాలను కూడా జడ్జ్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక మలయాళ మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్, ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ స్టోరీ ప్రశాంత గ్రామంలో సీరియల్ కిల్లింగ్స్‌ని సాల్వ్ చేసే ఒక లోకల్ డిటెక్టివ్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. ఈ మలయాళ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళ్తే
ప్లాచిక్కావు గ్రామంలో ఉజ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఒక లైబ్రేరియన్. లోకల్ డిటెక్టివ్‌గా చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి చీకటి భయం (నిక్టోఫోబియా) ఉంటుంది. తల్లిదండ్రులు నారాయణన్‌కుట్టి, లీలతో కలసి ఉంటాడు. గ్రామంలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. SI సచిన్ ఉజ్వలన్ సహాయంతో పెట్టీ కేసులు సాల్వ్ చేస్తుంటాడు. ఒకరోజు ఈ గ్రామం 50వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేస్తుండగా, స్కూల్ ప్రిన్సిపల్ అశోకన్ ఒక మాస్క్‌డ్ మ్యాన్ చేతిలో హత్యకు గురవుతాడు. ఉజ్వలన్ సీన్‌లో ఒక స్లిప్పర్, బీడీని గుర్తించి, లోకల్ థీఫ్ అంతిక్కురుడన్ ని సస్పెక్ట్‌గా భావిస్తాడు. ఈ కేసులో అంతిక్కురుడన్‌ని అరెస్ట్ చేస్తారు. కానీ అతను జైలు నుండి ఎస్కేప్ అవుతాడు.
ఒక ఫెస్టివల్ సమయంలో దివాకరన్ అనే మరో వ్యక్తి కూడా హత్యకు గురవుతాడు. ఈ సారి ఉజ్వలన్ అంతిక్కురుడన్ నిర్దోషి అని నమ్ముతాడు. ఎందుకంటే హత్యలు ఒకే పద్ధతిలో, OCD ఉన్న సీరియల్ కిల్లర్ చేసినట్లు కనిపిస్తాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడర్ CI శంభు మహదేవ్ రంగంలోకి దిగుతాడు. కిల్లర్‌ని “బూగీమాన్” అని పిలుస్తాడు. శంభు గ్రామంలో పాపులారిటీ పెరగడంతో, ఉజ్వలన్ జెలసీ ఫీలవుతాడు. మరో హత్యలో అరవిందన్‌ని బూగీమాన్ చంపి, శవాన్ని చెట్టుకు వేలాడదీస్తాడు. ఉజ్వలన్, శంభుని సస్పెక్ట్‌గా భావించి ఆరోపిస్తాడు. కానీ శంభు ఆ ఆరోపణలను తిప్పికొడతాడు. నారాయణన్‌కుట్టిని సస్పెక్ట్‌గా చూపిస్తాడు.
Read Also : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
నెట్‌ఫ్లిక్స్‌లో
‘డిటెక్టివ్ ఉజ్వలన్’ (Detective Ujjwalan) మలయాళ కామెడీ మిస్టరీ థ్రిల్లర్. ఇంద్రనీల్ గోపీకృష్ణన్ దీనికి దర్శకత్వం వహించారు. సోఫియా పాల్ దీనిని నిర్మించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ (ఉజ్వలన్), సిజు విల్సన్ (శంభు మహదేవ్), రోనీ డేవిడ్ రాజ్ (సచిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 23 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో 2025 జులై 11 నుండి స్ట్రీమింగ్‌లో ఉంది. 2 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.2/10 రేటింగ్ ఉంది.