BigTV English

Wealth Killer: దాచిపెడితే డబ్బు విలువ తగ్గుతుంది.. మీరు కచ్చితంగా ఆ తప్పు చేయకండి

Wealth Killer: దాచిపెడితే డబ్బు విలువ తగ్గుతుంది.. మీరు కచ్చితంగా ఆ తప్పు చేయకండి

దాచి పెడితే డబ్బు విలువ పెరుగుతుందా, తగ్గుతుందా. కచ్చితంగా పెరుగుతుంది అనే అనుకుంటాం. కానీ కాదు. ఒకవేళ పెరగాలి అంటే దాన్ని దాచిపెట్టే స్థానం చాలా ముఖ్యం. మనం బ్యాంకులో దాచి పెడుతున్నామా, షేర్లలో పెట్టుబడి పెడుతున్నామా, బంగారం కొంటున్నామా లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నామా.. అనేది మన డబ్బు విలువని డిసైడ్ చేస్తుంది. డబ్బుని డబ్బుగానే ఇంట్లో ఉంచుకుంటే రోజు రోజుకీ దాని విలువ తగ్గుతుంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం… ఈరోజు మనం ఒక కోటి రూపాయల నగదును ఇంట్లోనో లేక బ్యాంక్ లాకర్ లోనో దాచి పెడితే.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ కేవలం 25 లక్షల రూపాయలు అవుతుంది. అసలీ లెక్కలేంటో కాస్త క్లియర్ గా తెలుసుకుందాం.


ద్రవ్యోల్బణం
డబ్బుని, డబ్బు రూపంలో దాచిపెడితే దాని విలువ రోజు రోజుకూ తగ్గుతుందనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. దానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. అంటే ఉదాహరణకు ఈరోజు ఒక వస్తువు కేజీ 50 రూపాయలకు దొరుకుతుందని అనుకుందాం. ఆరేడేళ్ల తర్వాత అదే వస్తువులు విలువ కేజీ 100 రూపాయలకు పెరుగుతుంది. మన దగ్గర ఉన్న 50 రూపాయలకు అప్పుడు కేవలం అరకేజీ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ ద్రవ్యం విలువ తగ్గినట్టా పెరిగినట్టా..? వస్తువులు విలువ పెరిగేకొద్దీ ద్రవ్యం విలువ తగ్గుతుంది. అదే లెక్క. దీన్ని క్లుప్తంగా ద్రవ్యోల్బణం అంటారు. వెల్త్ కిల్లర్ అనికూడా అంటారు. పెరిగే ధరలకు అనుగుణంగా మన దగ్గర ఉన్న సంపద పెరగకపోతే మనం పేదవాళ్లం అయిపోతాం. అంటే పెట్టుబడికి వచ్చే రాబడి ఎప్పుడూ ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి. అప్పుడే మన సంపద పెరుగుతున్నట్టు లెక్క. ఒకవేళ అది ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంటే, మనకు నిజంగానే రాబడి వచ్చినా అది కేవలం ఊహాజనితం మాత్రమే.

20 ఏళ్ల తర్వాత..
వార్షిక ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంటే, 20 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం స్కూల్ ఫీజ్ ఏడాదికి రూ. 1 లక్ష గా ఉంటే, అదే స్కూల్ ఫీజు 20 ఏళ్ల తర్వాత రూ. 3.87 లక్షలు అవుతుంది.
ప్రస్తుతం రూ. 5 లక్షల వైద్య ప్రక్రియకు 20 సంవత్సరాల తర్వాత రూ. 19.35 లక్షలు ఖర్చవుతుంది.
ఇప్పుడు మనం నెలకు రూ. 50 వేల ఖర్చులు చేస్తుంటే, 20 సంవత్సరాల తర్వాత ఆ ఖర్చు నెలకు రూ. 1.93 లక్షలకు చేరుకుంటుంది. కాబట్టి 20 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేవారు కోటి రూపాయలు జమచేయాలి అనుకుంటే ద్రవ్యోల్బణాన్ని కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. మీరు సంవత్సరానికి 8 శాతం రాబడినిచ్చే పథకంలో రూ. 1 కోటి పెట్టుబడి పెట్టారనుకుంటే, 20 సంవత్సరాల తర్వాత అది దాదాపు రూ. 4.66 కోట్లకు పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంటే, రూ. 4.66 కోట్ల వాస్తవ విలువ ఇప్పటి విలువలో కేవలం రూ. 1.20 కోట్లు మాత్రమే.


రాబడి సున్నా..
మీ దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఉంటే.. 20 ఏళ్ల తర్వాత మీరు అదే కోటి రూపాయలతో కొనగలిగే వస్తువుల ధర ఇప్పటి రేట్లతో పోల్చుకుంటే కేవలం 25 లక్షలు మాత్రమే. అంటే కోటి రూపాయల విలువలో 74 శాతం తగ్గుదల కనపడుతుంది. చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు 7నుంచి 8 శాతం వార్షిక వడ్డీ వస్తుందని అనుకుంటారు. కానీ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంటే, వారి నిజమైన రాబడి సున్నా మాత్రమే.

మనమేం చేయాలి..?
ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మన రాబడి పెరగాలంటే.. కచ్చితంగా మనం రాబడి సూత్రాలను పాటించాల్సిందే. అందులో మొదటిది పొదుపు-పెట్టుబడి సూత్రం.
నెలవారీ కొంతమొత్తాన్ని బ్యాంకులో దాచుకుంటే అది పొదుపు. అదే పొదుపుని ఏదైనా రాబడి సాధనాల్లో పెడితే అది పెట్టుబడి. బ్యాంకు ఆర్డీ, ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని ఏమాత్రం అధిగమించలేం. అంటే అది సరైన పెట్టుబడి మార్గం కాదన్నమాట. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బంగారం వంటివి అసలైన పెట్టుబడి సాధనాలు.

రాబడిని లెక్కించేటప్పుడు ఈ తప్పు చేయకూడదు. నిజమైన రాబడిని ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసి లెక్కించాలి. 7 శాతం ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు 10 శాతం రాబడి వచ్చింది అంటే మనకు నికరంగా 3 శాతం మాత్రమే లాభం వచ్చిందనమాట. ఇక మన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి. ఒకసారి పెట్టుబడి పెట్టి తిరిగి దాన్ని పట్టించుకోకపోవడం తెలివి తక్కువ పని. పెట్టుబడితో లాభాలు రావాలంటే మంచి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. బలమైన దీర్ఘకాలిక ప్రణాళికను ఎంచుకోవాలి.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×