OTT Movie : హాలీవుడ్ సినీ ప్రియులకి మంచి స్టఫ్ ఇచ్చిన ఒక మూవీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మతిపోగొట్టింది. ఇందులో సైకిక్ లక్షణాలు ఉన్న అమ్మాయి ప్రేమిస్తే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చూపించారు. ఈ సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాళ్ళకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది క్రష్’ (The Crush). 1993లో విడుదలైన ఈ సినిమాకి అలాన్ షపిరో దర్శకత్వం వహించారు. ఇది 1993న ఏప్రిల్ 2 వార్నర్ బ్రదర్స్ ద్వారా విడుదలైంది. ఈ మూవీలో కారీ ఎల్వెస్ (నిక్ ఇలియట్), అలిసియా సిల్వర్‌స్టోన్ (అడ్రియన్/డారియన్ ఫారెస్టర్), జెన్నిఫర్ రూబిన్ (ఎమీ మాడిక్), కర్ట్‌వుడ్ స్మిత్ (క్లిఫ్ ఫారెస్టర్), గ్వినిత్ వాల్ష్ (లివ్ ఫారెస్టర్), అంబర్ బెన్సన్ (చెయెన్) నటించారు. ఇది అలిసియా సిల్వర్‌స్టోన్ నటించిన తొలి చిత్రం. ఆమెకు 1994 MTV మూవీ అవార్డ్స్‌లో బెస్ట్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్, బెస్ట్ విలన్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ మూవీ షపిరో నిజ జీవితంలో జరిగిన అనుభవం నుండి ప్రేరణ పొందింది. ఇందులో సిల్వర్‌స్టోన్ నటనకు ప్రశంసలు వచ్చాయి. IMDbలో ఈ సినిమాకి 5.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
28 ఏళ్ల రచయిత, జర్నలిస్ట్ అయిన నిక్ ఇలియట్ సీటెల్‌లో పిక్ మ్యాగజైన్‌లో కొత్త ఉద్యోగం కోసం వస్తాడు. అతను క్లిఫ్ ఫారెస్టర్, లివ్ ఫారెస్టర్ దంపతుల గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకుంటాడు. వాళ్ళకు 14 అడ్రియన్ ఫారెస్టర్ ఆనే అందమైన కూతురు ఉంటుంది. నిక్ ను చూసి అతనిపై వెంటనే క్రష్ పెంచుకుంటుంది. మొదట ఆమె ప్రవర్తన అమాయకంగా అనిపిస్తుంది. ఆమె నిక్ మ్యాగజైన్ ఆర్టికల్‌ను రివైజ్ చేసి ఆకట్టుకుంటుంది. అతనికి చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తుంది. నిక్ ఆమె ఇంటెలిజెన్స్‌కు పడిపోతాడు. కానీ ఆమె వయస్సు కారణంగా ఆమె అడ్వాన్సెస్‌ను సీరియస్‌గా తీసుకోడు.
అయితే అడ్రియన్ క్రష్ త్వరలో ఒక డేంజరస్ అబ్సెషన్‌గా మారుతుంది. ఫారెస్టర్స్ ఇంట్లో జరిగిన పార్టీలో, అడ్రియన్ నిక్‌ను సరదాగా వాక్‌కు తీసుకెళ్లి, అతన్ని కిస్ చేస్తుంది. నిక్ వెంటనే ఈ సంబంధం కరెక్ట్ కాదని గ్రహించి, ఆమెను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అడ్రియన్ అతని రిజెక్షన్‌కు కోపంతో, వినాశకర చర్యలకు దిగుతుంది. ఆమె నిక్ ఫేవరెట్ చైల్డ్‌హుడ్ ఫోటోను దొంగిలిస్తుంది. అతను కారును డ్యామేజ్ చేస్తుంది. అతని కంప్యూటర్ డిస్క్‌లను డిలీట్ చేస్తుంది. నిక్ ఈ చర్యల గురించి, అడ్రియన్ తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ, వాళ్ళు ఆమెనే నమ్ముతారు. ఇంతలో అడ్రియన్ ఫ్రెండ్ చెయెన్, నిక్‌ను హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. అడ్రియన్ ఆమె హార్స్ రైడింగ్ సాడిల్‌ను సబోటాజ్ చేసి, ఆమెకు యాక్సిడెంట్ కలిగిస్తుంది.
నిక్ తన కొలీగ్ ఫోటోగ్రాఫర్ ఎమీ మాడిక్ తో రిలేషన్లో ఉంటాడు. దీనితో అడ్రియన్ జెలసీ మరింత పెరిగిపోతుంది. ఆమె ఎమీని ఒక డార్క్ రూమ్‌లో లాక్ చేసి హత్యాయత్నం చేస్తుంది. అయితే ఎమీ ప్రాణాలతో బయటపడుతుంది. ఇక అడ్రియన్ చర్యలు మరింత ఎస్కలేట్ అవుతాయి. ఆమె నిక్‌ను సెక్సువల్ అసాల్ట్‌కు ఫ్రేమ్ చేస్తుంది. దీని వల్ల నిక్ అరెస్ట్ అవుతాడు, కానీ అతని బాస్ మైఖేల్ ఇతనికి బెయిల్ వచ్చేలా చేస్తాడు. ఆతరువాత అడ్రియన్ మరింత రెచ్చిపోతుంది.క్లైమాక్స్ వహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. చివరికి నిక్ కు అడ్రియన్ ఎలాంటి ఇబ్బందులను తెస్తుంది ? ఆమె నుంచి నిక్ ఎలా బయట పడతాడు ? ఈ స్టోరీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : భార్యను ప్రతిరోజూ ఒంటిపై నూలు పోగు లేకుండా చెక్ చేసే భర్త… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్