OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ప్రతీ భాషలోనూ ఈ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ, ఒక డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. ఒక కేసు విషయంలో తిరిగితే, మరో కేసు బయటపడుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime Video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వింటర్ రిడ్జ్’ (Winter Ridge). 2018లో విడుదలైన ఈ బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి డామ్ లెనోయిర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘Winter Ridge’ ఒక చిన్న బడ్జెట్ బ్రిటిష్ మూవీ అయినప్పటికీ, దాని సినిమాటోగ్రఫీ, కథనం కొంతమంది విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను చూసేవారిని, చివరి వరకు సీట్లకు అతుక్కునేలా చేస్తుంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ రియాన్ బర్న్స్ అనే యువ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. అతను తన వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఇంటికి వస్తాడు. అప్పుడే తన భార్య ఒక తీవ్రమైన కారు ప్రమాదంలో చిక్కుకుని, కోమాలోకి వెళ్లిపోయిందని తెలుసుకుంటాడు. ఏడు నెలల గడిచినా కూడా ఆమె ఇంకా కోమాలోనే ఉంటుంది. ఇక రియాన్ ఆమె పరిస్థితిని చూసి తట్టుకోలేక, తన దృష్టిని ఒక కొత్త కేసు మీదకు మళ్లిస్తాడు. ఈ కేసు ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను వృద్ధులైన, బలహీనమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ హత్యలు మొదట సహజ మరణాలుగా అనుకుంటారు. కానీ రియాన్ వాటి వెనుక ఉన్న నిజాన్ని కనుక్కోవడం ప్రారంభిస్తాడు. అందులో భాగంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు తీసుకెళ్తాడు. అతను తన భార్య పరిస్థితికి, బాధితులకు మధ్య ఏదో సంబంధం ఉందని గుర్తిస్తాడు. దీనితో అతనికి కొన్ని అనుమానాలు కలుగుతాయి.
రియాన్ ఈ సీరియల్ కిల్లర్‌ను వెతుకుతున్నప్పుడు, అతని సందేహాలు ఇంకా పెరుగుతాయి. తన భార్యను ఒక డాక్టర్ చంపాలని చూసిందని తెలుసుకుంటాడు. చివరికి ఆ హత్యలు చేస్తున్న డాక్టర్ ని కూడా కనిపెడతాడు. ఆమె చెప్పిన విషయాలు విని పిచ్చెక్కిపోతాడు. ఆమె భర్త మతిమరుపు వల్ల కూతురు చనిపోతుంది. అలాగే భర్త కూడా చనిపోతాడు. అందుకే మతిమరుపు ఉన్నవాళ్ళని చంపుతూ ఉంటుంది ఈ డాక్టర్. మరో ఫ్యామిలీ ఇలా బాధపడకూడదని ఇలా చేస్తూ ఉంటుంది. చివరికి రియాన్ వెలుగులోకి తెచ్చిన విషయాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వింటర్ రిడ్జ్’ (Winter Ridge) అనే ఈ మూవీ పై ఓ లుక్ వేయండి. చివరికి ఈ మూవీ ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో, భావోద్వేగపరమైన ముగింపును ప్రేక్షకులకి అందిస్తుంది.