Heroine Meena : ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ మీనా.. ఈమె గురించి అందరికీ తెలుసు. నిజానికి మా తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగులో వరుస సినిమాలు తీస్తూ తెలుగమ్మాయిలాగా ఉండేది. తొంభైలలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్నా మీనా బాల్యనటిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సక్సెస్ లు చూసింది.. అప్పట్లో వరుస సినిమాలో నటిస్తూ భారీ విజయాలను తన అకౌంట్లో వేసుకుంటూ వచ్చింది. అలాంటి మీనా ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు కీలక పాత్రల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ హీరోయిన్ మీనా నువ్వు స్టేజ్ మీద దారుణంగా అవమానించింది అంటూ ఆ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగిందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెళ్లయ్యాక కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కీలక పాత్రల్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇటీవలే మీనా భర్త చనిపోయారు. కొంత బ్రేక్ తరువాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. అయితే తాజాగా ఒక సినిమా ప్రొమోషన్స్ లో మీనాకు అవమానం జరిగిందంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. స్టేజ్ మీదే తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ఘోరంగా అవమానించిందని ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది.
Also Read : రాజమౌళి – మహేష్ మధ్య గొడవలా.. సినిమాకు బ్రేక్ పడుతుందా..?
అసలు మ్యాటరేంటంటే.. దేవత రూపంలో ఎంతో మంది హీరోయిన్స్ నటించి మెప్పించారు. ఇప్పటికి వర్ధమన హీరోయిన్స్ కూడా దేవతలగా నటించడానికి ఆసక్తి చూపుతారు. తమిళ లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార దేవత పాత్రలో నటించి హిట్ కొట్టిన సినిమా ‘ముక్కుతి అమ్మన్ ‘.. ఈ మూవీ పార్ట్ 2 కూడా రాబోతుంది హీరోయిన్ ఖుష్బూ వాళ్ళ భర్త సుందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అందరికి షాక్ ఇచ్చింది. అయితే వేదిక మీద ఖుష్బు, మీనా, డైరెక్టర్ సుందర్ అందరూ ఉండగా నయన్ కేవలం ఖుష్బు ను ఆమె భర్త సుందర్ ను పలకరించి మీనా ను పలకరించలేదు. మధ్యలో మీనా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నయనతార మొహం చాటేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీనా తో మాట్లాడటం ఇష్టం లేనట్టు ప్రవర్తించింది. ఇది జరిగి కొద్ది రోజులైనా సోషల్ మీడియాలో దీనిపై వార్తలు మాత్రం ఆగలేదు అంత పెద్ద హీరోయిన్ ని నయనతార దారుణంగా అవమానించింది అంటూ ప్రచారం జరుగుతుంది.. కొందరు మీనా ఫ్యాన్స్ అయితే నయనతార బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై నయనతార ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..