BigTV English

OTT Movie : ఐఎండీబీలో 9.8 రేటింగ్… డిఫరెంట్ స్టోరీ లైన్ తో దుమ్మురేపుతున్న కన్నడ థ్రిల్లర్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు

OTT Movie : ఐఎండీబీలో 9.8 రేటింగ్… డిఫరెంట్ స్టోరీ లైన్ తో దుమ్మురేపుతున్న కన్నడ థ్రిల్లర్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఫాంటసీ సినిమా, డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గాఒటిటిలోకి వచ్చి, దుమ్ములేపుతూ ట్రెండింగ్ అవుతోంది. ఇందులో ఒక ఆత్మ భూమి మీద మళ్ళీ పుట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తనకు జన్మనిచ్చే తల్లిదండ్రులను కూడా వెతుక్కుంటుంది. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులతో ముందుకు సాగుతుంది. ఈ కన్నడ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


SunNXTలో స్ట్రీమింగ్

“X & Y” 2025లో విడుదలైన కన్నడ కామెడీ ఫాంటసీ చిత్రం. దీనికి D. సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక పుట్టబోయే ఆత్మ ప్రత్యేకమైన కథతో, ఫాంటసీ, వాస్తవిక థీమ్‌లను సమన్వయం చేస్తూ ఒక అద్భుతమైన థ్రిల్ ను అందిస్తుంది. ఈ చిత్రం 2025 జూన్ 26న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం SunNXT ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో కన్నడ భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది ఐఎండీబీలో కూడా  9.8 టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది.


Read Also : స్టాంప్ వేసి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్… మైథలాజికల్ టచ్ తో పిచ్చెక్కించే సైకో సిరీస్

స్టోరీలోకి వెళితే

‘X & Y’ కథ ఒక పుట్టబోయే ఆత్మ చుట్టూ తిరుగుతుంది. అది భూమిపై మళ్ళీ జన్మించాలని బలంగా కోరుకుంటుంది. భగవంతుడు ఆ ఆత్మకు ఒక ప్రత్యేక అవకాశం ఇస్తాడు. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు భూమిపై ఉండి, తన భవిష్యత్తు తల్లిదండ్రులను, అంటే XX (స్త్రీ), XY (పురుషుడు)ని కలపాలి. వారిని ఒక్కటి చేయగలిగితేనే ఆ ఆత్మ పుట్టగలదు. ఈ మిషన్ కోసం, ఆత్మ క్రీడే (సత్య ప్రకాష్) అనే యాంబులెన్స్ ఆటో డ్రైవర్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. క్రీడే ద్వారా, ఆత్మ తన భవిష్యత్తు తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నిస్తుంది. కానీ భూమిపైన ఉన్న సమయంలో ఈ ఆత్మ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది.

చివరకు ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకుని, సృష్టికర్త వద్దకు తిరిగి వెళ్లాలని కోరుకుంటుంది. సినిమా మొదటి భాగం హాస్యంతో, ఆకర్షణీయమైన పాత్రలతో సరదాగా సాగుతుంది. అయితే రెండవ భాగం ఎమోషన్స్ తో నడుస్తుంది. క్రీడే, కృప పాత్రలు కథకు మరింత బలాన్ని ఇస్తాయి. చివరకు ఆత్మ తన పుట్టుక గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆత్మ మనసు మారడానికి కారణం ఏమిటి ? భగవంతుడు ఈ ఆత్మకు మళ్ళీ అవకాశాన్ని ఎందుకు ఇస్తాడు ? అనే విషయాలను ఈ కన్నడ కామెడీ ఫాంటసీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

Big Stories

×