OTT Movie : ప్రపంచంలో మగాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే, అది బట్ట తల మాత్రమే. ఈ సమస్యతో ఎంతో మంది అబ్బాయిలు మానసికంగా కుంగిపోతున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చినఒక తమిళ సినిమా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తోంది. ఐయండిబిలో ఇది ఏకంగా 8.7/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో కూడా అడుగు పెట్టేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా కితకితలు పెడుతోంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.
“సొట్ట సొట్ట నానైయుతు” (Sotta Sotta Nanaiyuthu) అనేది 2025లో విడుదలైన తమిళ కామెడీ సినిమా. నవీద్ ఎస్ ఫరీద్ దీనికి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో నిషాంత్ రుస్సో, వర్షిణి వెంకట్, షాలిని, కెపివై రాజా, పుగజ్, రోబో శంకర్ నటించారు. సంగీతం రెంజిత్ ఉన్ని అందించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 29న థియేటర్స్‌లో విడుదలైంది. 122 నిమిషాల నిడివితో ఐయండిబిలో 8.7/10 రేటింగ్ ని పొందింది. ఇది అక్టోబర్ 31 నుంచి Aha లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాజా అనే యువకుడికి ఆస్తితో పాటు మంచి జాబ్ కూడా ఉంది. కానీ తలపై జుట్టు ఒక్కటి లేదు. ఇది చూసి అతను రోజూ టెన్షన్ పడుతుంటాడు. ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా? అని బాధపడుతుంటాడు. దీనికి తోడు అతని ఫ్రెండ్స్ అతన్ని టీజ్ చేస్తుంటారు. తలపై జుట్టు లేకపోతే ప్రియురాలు ఎక్కడినుంచి వస్తుందని ఏడిపిస్తుంటారు. అయితే ఒక రోజు ప్రియా అనే అమ్మాయితో రాజాకి పెళ్లి చూపులు జరుగుతాయి. రాజా తన బట్టతలను విగ్ పెట్టి కవర్ చేస్తాడు. హీరోలా ఉన్నావని రాజాను చూసి ప్రియా ఇష్టపడుతుంది. వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. కలిసి సినిమాలు, బీచ్‌కి వెళ్తారు. కానీ రాజాలో టెన్షన్, నా బాల్డ్ నెస్ చూస్తే పారిపోతుందని అనుకుంటూ ఉంటాడు. ఒక రోజు ప్రియా రాజా తల తడుముతుంది. రాజా భయపడి ఆమెకు దూరం అవుతాడు. ఈ మిస్ అండర్ స్టాండింగ్ వల్ల మ్యాచ్ ఫెయిల్ అవుతుంది.
Read Also : దెయ్యం పట్టిన అమ్మాయిని పిలిచి దిక్కుమాలిన పని… రేటింగ్ పెంచుకోవడానికి లేట్ నైట్… వణికించే హర్రర్ మూవీ
రాజాకి శృతి అనే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ మళ్ళీ పెళ్లి చూపులు మొదలవుతాయి. ష్రుతి మోడర్న్, రాజా విగ్ చూసి ఇష్టపడుతుంది. వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ రాజా మనసులో ఇంకా ప్రియా ఉంది. ప్రియా సింపుల్ ఆమ్మాయి. శృతి మోడర్న్ గా ఉంటుంది. ఎవరిని ఎంచుకోవాలి? పొరపాటున విగ్ ఊడిపోతే ఏం జరుగుతుంది అనే టెన్షన్ మళ్ళీ పట్టుకుంటుంది. క్లైమాక్స్ ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. చివరికి రాజా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ? అసలు పెళ్లి జరుగుతుందా ? ఈ బట్ట తలకి పరిష్కారం దొరుకుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.