OTT Movie : ఈ మధ్య రియల్ క్రైమ్ డాక్యుమెంటరీలు బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇవి ఎలా జరిగాయని, ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తునారు. ఇక సీరియల్ కిల్లర్స్ స్టోరీ లైతే మరింత ఇంటెన్స్ గా ఉంటాయి. మగవాళ్లే కాదు, ఇలాంటి హత్యలు ఆడవాళ్ళు కూడా చేసి చూపించారు. ఈ కథ ఎయిలీన్ వూర్నోస్ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె 1989-90లో ఫ్లోరిడాలో 7 మంది మగ వాళ్ళను చంపింది. ఆమె ప్రాస్టిట్యూట్ చేస్తూ చంపిందని న్యాయస్థానంలో కూడా ఒప్పుకుంది. ఆ తరువాత ఆమెకు ఎలక్ట్రిక్ చెయిర్‌లో మరణ శిక్షను విధించి చంపేశారు. ఈ సినిమా ఆమె బాల్యం నుంచి చంపబడే వరకు అన్నీ చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
‘ఎయిలీన్: క్వీన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్’ (Aileen: Queen of the Serial Killers) అనేది 2025లో విడుదలైన డాక్యుమెంటరీ సినిమా. ఇది ఎమిలీ టర్నర్ డైరెక్షన్‌లో రూపొందింది. 103 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ డాక్యుమెంటరీ, ఐయండిబిలో 6.2/10 రేటింగ్ తో ఉంది. ఇది రియల్ సీరియల్ కిల్లర్ ఎయిలీన్ వూర్నోస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఇద్దరమ్మాయిల మధ్య లవ్వు… ఆ సీన్లతో ఇండియాలో బ్యాన్… ఒంటరిగా చూడాల్సిన సీన్లే హైలెట్
ఎయిలీన్ వూర్నోస్ 1956లో మిచిగాన్‌లో పుట్టింది. అమ్మ లౌరా ఆమెను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళి పోయింది. నాన్న మెంటల్ పేషెంట్, ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. ఎయిలీన్ తాతయ్య, అమ్మమ్మ దగ్గర పెరిగింది. అయితే ఇద్దరూ ఆమెను కొడుతూ, సె*క్స్ అబ్యూస్ చేసేవాళ్ళు. 11 ఏళ్లకే డబ్బు కోసం రోడ్డు మీద సె*క్స్ వర్కర్ అయింది. 14 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయింది. కానీ బేబీని అడాప్షన్‌కు ఇచ్చేసింది. 20 ఏళ్లకు చీటింగ్, రాబరీ, డ్రంక్ డ్రైవింగ్ లతో అరెస్ట్ ల వరకూ వెళ్ళింది. నిజానికి ఆమె ఒక లెజ్బియన్, ఒక టై అనే అమ్మాయి తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఫ్లోరిడా హైవేల మీద ఉండి, ట్రక్ డ్రైవర్లతో గడుపుతూ ఉండేవాళ్లు. ఆ తరువాత ఎయిలీన్ ఒక గన్ కొనుక్కుంది. ఆ గన్ తో 1989-90లో ఫ్లోరిడా హైవేల మీద 7 మంది మిడిల్ ఏజ్ మగాళ్లను చంపింది. పోలీస్ లు ఆమెను ట్రాక్ చేసి 1991లో ఒక బార్‌లో పట్టుకున్నారు. ఆమెకు కోర్ట్ మరణ శిక్ష విధించింది. జైలులో ఎయిలీన్ ఫేమస్ అయింది. టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చింది. 2002 అక్టోబర్ 9న ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేశారు. ఇలా ఈ లేడి సైకో కిల్లర్ కథ ముగిసింది.