HHVM Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. గత కొన్నేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఈనెల 24న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకుంటున్న సరే కలెక్షన్లు మాత్రం భారీగానే వసూలు చేస్తున్నడంతో సినిమా హిట్ అనే టాక్ వినిపిస్తుంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించగా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైన కూడా కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ సినిమాని పూర్తి చేశారు. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని ఆయన బంధువు దయాకర్ రావు నిర్మించాడు. మొదటిసారి ప్లాన్ ఇండియా సినిమాగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అయిన ఏ మూవీ హిందీ రిలీజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
వీరమల్లు హిందీలో ఎప్పుడంటే..?
పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో హిందీ రిలీజ్ చేయలేదు. ఈ సినిమా హిందీ వర్షన్ రాబోతున్న శుక్రవారం నాడు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓ ఛానెల్ కు డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాక సినిమా గ్రాఫిక్స్ విషయంలో వస్తున్న కంప్లైంట్స్ గురించి ఆయన స్పందిస్తూ, సినిమా కథ లేదా ఇతర విషయాల మీద కంప్లైంట్స్ ఉంటే ఏమైనా చెప్పొచ్చు.. ఇక అలాంటి వాటి మీద కంప్లైంట్స్ లేకపోవడంతోనే గ్రాఫిక్స్ బాలేదని మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. తెలుగులో పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ హిందీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read:తల్లి తాళి తాకట్టు పెట్టి కడుపునింపుకున్నాం.. కన్నీళ్లు తెప్పిస్తున్న శోభా స్టోరీ..
ఈ మూవీ కలెక్షన్స్..
ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే.. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్లు వ్యయం అయ్యిందని టాక్. అలాగే తొలిసారిగా పవన్ కళ్యాణ్ నుంచి పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుండటంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి ఇండియాలో రూ.117 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో మరో 10 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.127 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మూడు రోజులకు గాను 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది.. మరి ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటే చూడాలి..