Alia Bhatt Photos: రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్‌గా నటించింది ఆలియా భట్. ఆ చనువుతోనే తన తరువాతి సినిమాకు సపోర్ట్ చేయడానికి ఈ దర్శక ధీరుడు ముందుకొచ్చారు.
ప్రస్తుతం ఆలియా భట్.. ‘జిగ్రా’ మూవీ విడుదలకు వెయిట్ చేస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదలయ్యింది.
‘జిగ్రా’ ట్రైలర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆలియా భట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు రాజమౌళి.
అక్టోబర్ 11న ‘జిగ్రా’ మూవీ థియేటర్లలో విడుదల అవుతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది ఆలియా భట్.
రాజమౌళి మాత్రమే కాదు మరెందరో సినీ సెలబ్రిటీలు కూడా ఆలియా భట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.