మూసీ నదీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. మూసీ కలుషితం వల్ల చుట్టు పక్కల ఉన్న బోర్ వాటర్ కూడా తీవ్రంగా కలుషితమైందని, అందుకే మూసీ రివర్ బెడ్ పరిసరాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మూసీ చుట్టు పక్కన నివాసం ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాధలు ఎలా ఉంటాయో తనకు కూడా తెలుసని, తాను కూడా అలాంటి చోట్లనే నివాసం ఉన్నానన్నారు.
Also Read : మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం ప్రభుత్వం తప్ప అని ప్రతిపక్షాలను నిలదీశారు. మూసీ, హైడ్రాపై బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని, దాన్ని ఆ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ కట్టుకుని సకల సౌకర్యాలతో ఉండొచ్చని, ఇటలీ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతున్నాడని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కానీ పేదలు మాత్రం గుక్కెడు మంచినీళ్లు తాగొద్దా అని ప్రశ్నించారు.