Disha Patani – Kalki 2898 Ad New Poster: నటి దిశా పటానీ.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీలో తన అందాలతో రచ్చ రచ్చ చేసింది. సినీ ప్రియుల్ని తన అందం, నటనతో కట్టిపడేసింది.

ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి.. అక్కడ టాప్ హీరోయిన్‌గా అదరగొడుతోంది. పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.

ఎద అందాలు, నడుము ఒంపుసొంపులతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేయడంలో ఈ అందాల రాక్షసి ఎప్పుడూ ముందుంటుంది.

కాగా ఇప్పుడు ఈ ఒంపుసొంపుల భామ టాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తుంది. ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో నటిస్తుంది.

ఈ మూవీ జూన్ అంటే ఈ నెల 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే జూన్ 13న దిశాపటానీ బర్త్ డే కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తూ కల్కి మూవీ యూనిట్ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ మూవీలో దిశా పటానీ ‘రోక్సీ’ పాత్రలో నటిస్తుందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

అందులో దిశా పటానీ స్టైల్, హాట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ వైరల్‌గా మారింది.