Meenakshi Chaudhary Latest Photos: ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొందరు మల్టీ టాలెంటెడ్ అయ్యింటారు. అలా డాక్టర్ చదివినా యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
తెలుగు సినిమాల్లో తన డెబ్యూ అంత గ్రాండ్‌గా లేకపోయినా కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీలో నటించినా కూడా మీనాక్షికి దానివల్ల అంతగా గుర్తింపు రాలేదు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
ఇప్పటివరకు మీనాక్షి చౌదరికి వచ్చిన పాత్రలు, కథలు చాలావరకు తన కెరీర్‌కు అంతగా హెల్ప్ అవ్వలేదు. కానీ ఇటీవల విడుదలయిన ‘లక్కీ భాస్కర్’ అలా కాదు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
‘లక్కీ భాస్కర్’ సినిమాలో సుమతి అనే పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా చాలావరకు దుల్కర్ సల్మాన్ చుట్టూనే తిరిగినా మీనాక్షి నటన కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
తాజాగా పింక్ డ్రెస్‌లో కొత్త అవతారంతో కనిపించి తన ఫ్యాన్స్‌ను కవ్వించింది మీనాక్షి. తను ఎలా ఉన్నా అందంగానే ఉంటుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)