Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త వచ్చినా, ఆ కుటుంబంలో ఎప్పుడు ఏం జరిగినా ఆ విషయాలు వెంటనే వైరల్ అయిపోతాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు అనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉంది. ముఖ్యంగా మంచు మనోజ్ పెళ్లి విషయంలోనే ఆ ఫ్యామిలీ విభేదాలు వచ్చాయని, ఇప్పటికీ ఈ పెళ్లిని తన కుటుంబం ఒప్పుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే విష్ణుతో మంచు మనోజ్‌కు ఒకసారి గొడవ కూడా జరిగింది. ఇవన్నీ ఇలా ఉండగా.. తాజాగా ఆస్తుల వ్యవహారంలో మోహన్ బాబుతో మంచు మనోజ్‌కు గొడవలు జరిగాయని వార్తలు వస్తుండగా.. దానిపై నిజానిజాలు బయటికొచ్చాయి.
స్పందన అబద్ధం
ఆస్తుల విషయంలో మంచు మనోజ్ (Manchu Manoj)కు, తన తండ్రి మోహన్ బాబుకు గొడవ జరిగిందని ఆదివారం ఉదయం ఒక వార్త బయటికొచ్చింది. అంతే కాకుండా పరస్పరం దాడి కూడా చేసుకున్నారని అన్నారు. ఈ గొడవపై సీరియస్‌గా ఉన్న మనోజ్.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయినట్టు కూడా సమాచారం అందింది. వెంటనే మోహన్ బాబు టీమ్ దీనిపై స్పందించింది. అసత్య ప్రచారాలు చేయకండి అంటూ మీడియాకు, నెటిజన్లను రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా అసలు విషయం ఇంకేదో ఉందని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఇంతలోనే అసలు మోహన్ బాబుకు, మంచు మనోజ్‌కు మధ్య ఏం జరిగిందనే విషయం బయటికొచ్చింది. ఇందులో చాలావరకు నిజముందని తెలిసింది.
Also Read: తండ్రీకొడుకుల పరస్పర ఫిర్యాదులు.. అసత్య ప్రచారాలపై మండిపడ్డ మోహన్ బాబు టీమ్..?
మనసు మార్చుకున్నాడు
మోహన్ బాబు (Mohan Babu) యూనివర్సిటీ పనులు చూసుకోవడానికి తనకు వినయ్ అనే ఒక అనుచరుడు ఉన్నాడు. ఆ అనుచరుడే మంచు మనోజ్‌పై దాడి చేశాడట. స్కూల్ ఆస్తుల విషయంలో వినయ్, మనోజ్ మధ్య వాగ్వాదం మొదలయ్యింది. ఆ సమయంలోనే మనోజ్‌పై వినయ్ దాడి చేశాడని సమాచారం. ఆ దాడిలో మనోజ్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాలతోనే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వినయ్‌పై ఫిర్యాదు చేయాలని మనోజ్ ఫిక్స్ అయ్యాడు. వెంటనే పోలీసులకు కూడా ఈ విషయంపై సమాచారం అందించాడని, తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పిన మనోజ్.. హఠాత్తుగా మనసు మార్చుకున్నాడని, తమ వద్దకు రాలేదని పోలీసులు చెప్తున్నారు.
రౌడీలతో కలిసి దాడి
ప్రస్తుతం వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నాడు. స్కూల్‌కు సంబంధించిన విషయంలోనే మనోజ్‌కు, వినయ్‌కు మధ్య గొడవ మొదలుకాగా.. వినయ్‌తో పాటు తన రౌడీ మూక కూడా ఈ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని మనోజ్‌పై దాడిచేశారు. ఇందులో మోహన్ బాబు ప్రమేయం కూడా ఉందని మనోజ్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకే తన తండ్రితో పాటు వినయ్‌పై ఫిర్యాదు చేయాలని మనోజ్ అనుకున్నాడు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక మనోజ్ ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయితే వినయ్ కూడా మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.