BigTV English

Pushpa 2: ఫ్యాన్స్ కి శుభవార్త.. తగ్గిన టికెట్ ధరలు.. రేపటి నుంచి వర్తింపు..!

Pushpa 2: ఫ్యాన్స్ కి శుభవార్త.. తగ్గిన టికెట్ ధరలు.. రేపటి నుంచి వర్తింపు..!

Pushpa 2:ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు అల్లు అర్జున్ (Allu Arjun). 2021లో సుకుమార్(Sukumar), అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప(Pushpa). ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మొత్తం ప్రెస్ మీట్ కు హాజరైంది.


సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేసిన నిర్మాత..

ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని (Naveen yerneni) మాట్లాడుతూ..” సినిమా విడుదలైన తరువాత పని ఎక్కువ అయింది. అందరి దగ్గర నుండి కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇదే ఈ చిత్ర విజయానికి నిదర్శనం. ముఖ్యంగా ఈ సినిమాను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.. వేగంగా రూ.500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ కూడా గర్వకారణం” అంటూ తెలిపారు తెలిపారు.


టికెట్ ధరలపై నిర్మాత కామెంట్స్..

ఇక ఇదే సందర్భంగా నిర్మాత వై.రవి శంకర్ (Y.Ravi Shankar) కూడా మాట్లాడుతూ.. “సినిమా టికెట్ ధరలపై గుడ్ న్యూస్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేరుపేరునా ధన్యవాదాలు. మా సినిమా టికెట్ ధర రూ.800అని అనుకున్నారు. కానీ అది కేవలం ప్రీమియర్స్ కి మాత్రమే. ఇక నుండి థియేటర్లలో టికెట్ రేట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అందరూ కూడా చూడాలని మేము కోరుకుంటున్నాము” అంటూ ఆయన తెలిపారు.

తగ్గిన టికెట్ ధరలు..

రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 – రూ.150 మేరా తగ్గాయి.. రేపటి నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే సెకండ్ క్లాస్ రూ.80, ఫస్ట్ క్లాస్ రూ.140, బాల్కనీ రూ.200 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ధరలు కూడా బుకింగ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ మేర టిక్కెట్ ధరలు తగ్గడంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూవీ టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనికి తోడు తెలంగాణలో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు తెలిపారు. ఏది ఏమైనా పుష్ప-2 ధరలు తగ్గడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ టికెట్ బుకింగ్ కి ఎగబడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏ మేరకు రేపటి నుంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×