Priyanka Jawalkar Latest Photos: టాలీవుడ్‌లో ఉన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. అయితే తెలుగమ్మాయిలు అంటే గ్లామర్ షో చేయకూడదు అనే రూల్‌ను చాలామంది బ్రేక్ చేస్తుండగా.. ప్రియాంక కూడా వారినే ఫాలో అవుతోంది. (Image Source: Priyanka Jawalkar/Instagram)
విజయ్ దేవకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. అందులో కేవలం ఒక కమర్షియల్ హీరోయిన్ పాత్రనే పోషించింది. తన యాక్టింగ్‌కు అంతగా స్కోప్ లేదు. (Image Source: Priyanka Jawalkar/Instagram)
‘టాక్సీవాలా’లో హీరోయిన్‌గా పరిచయమయ్యే ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది ప్రియాంక. అందులో కూడా తన గ్లామర్‌ను అంతగా బయటపెట్టలేదు. (Image Source: Priyanka Jawalkar/Instagram)
ఇక హీరోయిన్‌గా వెండితెరపై పరిచయమయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించింది ప్రియాంక జవాల్కర్. కానీ మెల్లగా తన పద్ధతి పూర్తిగా మారిపోయింది. (Image Source: Priyanka Jawalkar/Instagram)
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రియాంక జవాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. (Image Source: Priyanka Jawalkar/Instagram)
తాజాగా డీప్ నెక్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి గోల్డెన్ గర్ల్‌గా ఫీలవుతున్నానంటూ క్యాప్షన్ పెట్టింది ప్రియాంక జవాల్కర్. (Image Source: Priyanka Jawalkar/Instagram)