Samantha Latest Photos: సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయమయినప్పుడు సమంతకు ఉన్న గ్రేస్, ఛార్మ్ అన్నీ వేరే లెవెల్. కేవలం తన యాక్టింగ్‌తోనే ఆకట్టుకుంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న సామ్.. గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. (Image Source: Samantha/Instagram)
నాగచైతన్యతో విడాకులు, మయాసైటీస్ వ్యాధి.. ఇలా పలు కారణాల వల్ల సమంత పర్సనల్ లైఫ్ చాలా డౌన్ అయిపోయింది. దానివల్ల తన ఆలోచనా విధానం కూడా మారింది. (Image Source: Samantha/Instagram)
మయాసైటీస్ అనే వ్యాధితో బాధపడుతూ చికిత్స అందుకుంటున్న సమయంలో ఒంటరి పోరాటం చేయడంతో మరింత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానని తన ఫ్యాన్స్‌కు మాటిచ్చింది సమంత. (Image Source: Samantha/Instagram)
సమంత ఇచ్చిన మాట ప్రకారం ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్.. తన కెరీర్‌లోనే సెకండ్ ఇన్నింగ్స్ అని భావిస్తున్నారు ఫ్యాన్స్. (Image Source: Samantha/Instagram)
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. (Image Source: Samantha/Instagram)
మునుపెన్నడూ ప్రేక్షకులు తనను చూడని పాత్రలో ‘సిటాడెల్ హనీ బన్నీ’లో కనిపించి ఒక్కసారిగా తను కమ్ బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించింది సమంత. (Image Source: Samantha/Instagram)
‘సిటాడెల్ హనీ బన్నీ’లో సమంతకు జోడీగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. వీరిద్దరూ కలిసి ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడ్డారు. (Image Source: Samantha/Instagram)
ఇప్పటివరకు సమంత కెరీర్‌లో ఆన్ స్క్రీన్ లిప్ లాక్ సీన్స్ చేసింది చాలా తక్కువ. అలాంటి ‘సిటాడెల్ హనీ బన్నీ’లో వరుణ్ ధావన్‌తో కలిసి తను చేసిన లిప్ లాక్ సీన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. (Image Source: Samantha/Instagram)
తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమే వరుణ్ ధావన్‌తో కలిసి హాట్ ఫోజులిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. (Image Source: Samantha/Instagram)