BigTV English

Prabhas- Anushka: రాజావారు- రాణిగారు.. సిగార్ తో ఇలా కనిపించారు

Prabhas- Anushka: రాజావారు- రాణిగారు.. సిగార్ తో ఇలా కనిపించారు

Prabhas- Anushka: రాజాగారు.. రాణిగారు.. పెళ్లితో ఒకటయ్యారు అని కిరణ్ – రహస్య ఫ్యాన్స్ మొన్నటి వరకు పాడుకున్నారు. ఇక ఇప్పుడు అదే పాటను ప్రభాస్ – అనుష్క ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రాజాగారు.. రాణిగారు.. ఏదోరోజు ఒకటవుతారు అంటూ ఊహల్లో  జీవించేస్తున్నారు. బిల్లా  సినిమాతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కానీ, తాము ఇంకా స్నేహితులమే అని ప్రభాస్ – అనుష్క చెప్పుకొస్తున్నారు.


మిర్చి, బాహుబలి 1, 2 సినిమాల్లో ఈ జంట కనువిందు చేసింది. నిజంగా  ఈ జంటను సినిమాలో చూసిన వారెవరైనా .. బయట కూడా వీరు కలవాలనే కోరుకుంటారు. ఇద్దరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు. ముఖ్యంగా  బయట ఈవెంట్స్ లో డార్లింగ్ ను స్వీటీ చూసే చూపు.. వీరి మధ్య ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితురాలు అంటే స్వీటీనే అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోపోవడానికి కారణమేంటో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం వారి ప్రమేయం లేకుండా AI తో వీరికి పెళ్లి కూడా చేసేసారు.

Samantha: బాలీవుడ్ హీరోతో సమంత హాట్ ఫోజులు.. చాలా మారిపోయావ్ సామ్!


ఇక ఇదంతా తెలిసిందే కదా .. మళ్లీ ఇప్పుడెందుకు చెప్తున్నారు  అంటే.. నేడు అనుష్క పుట్టినరోజు. కొంతకాలంగా  సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో ఘాటీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ త్వరలొనే అమెజాన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇక నేడు స్వీటీ పుట్టినరోజు కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో స్వీటీ.. ఉగ్రరూపంలో కనిపించింది. రక్తం కారుతున్న నుదురు.. కోపంతో రగులుతున్న కళ్లు.. రక్తంతో తడిసిన చేత్తో నోట్లో సిగార్ పీలుస్తూ స్వీటీని చూస్తే ఎవ్వరైనా భయపడకుండా ఉండలేరు అంటే  అతిశయోక్తి. ఒక్క పోస్టర్ తోనే సిరీస్ పై  అంచనాలను ఆకాశాన్నీ తాకేలా చేశాడు క్రిష్.

Citadel: కమ్ బ్యాక్ లో ఘోర పరాభవం.. సామ్ పరిస్థితి ఏంటి..?

ఇక ఈ పోస్టర్ చూసాక.. ప్రభాస్- అనుష్క మ్యూచువల్ ఫ్యాన్స్..  రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కూడా ఇలానే సిగార్ కాలుస్తున్న ఫోటోను, ఈ ఫోటోను పక్కపక్కన పెట్టి.. రాజావారు- రాణిగారు.. సిగార్ తో ఇలా కనిపించారు  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ జంట ఫ్యాన్స్ కోరికను తీరుస్తుందో లేదో..  కాలమే నిర్ణయించాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×