BigTV English

Supreme court : లైగింక ఆరోపణ కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు.. హై కోర్టు తీర్పు రద్దు.. ఏం జరిగిందంటే.?

Supreme court : లైగింక ఆరోపణ కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు.. హై కోర్టు తీర్పు రద్దు.. ఏం జరిగిందంటే.?

Supreme court : లైంగిక ఆరోపణల కేసుల్లో ఇష్టానుసారం కేసుల రద్దుకు వీలు లేదని సుప్రీం తేల్చి చెప్పింది. బాధితులు ప్రాణాలతో బయటపడిన సందర్భాల్లో.. నిందితులు, బాధితుల కుటుంబ సభ్యుల మధ్య రాజీ ఆధారంగా.. కేసులను రద్దు చేయడం కుదరదని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేసుల్లో నిందితులు, బాధితులు మధ్య తలెత్తే వివాదంలో రాజీ పడితే.. ఆయా కేసులు రద్దు చేసుకునేందుకు వీలవుతుంది. అయితే.. క్రిమినల్ కేసుల్లో ఇలాంటి అవకాశం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో.. కోర్టులు వాటికున్న విఛక్షణాధికారాన్ని వినియోగించుకుని.. కొన్ని కేసుల్ని రద్దు చేస్తుంటాయి. కానీ.. ఇకపై అలా చేయడానికి వీలు లేదన్న సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలతో.. దేశంలోని అనేక కేసులకు ఈ తీర్పు మార్గనిర్దేశం కానుంది.


ఇదే అంశంపై రాజస్థాన్ హైకోర్టు వెలువరించిన ఓ తీర్పుపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. రాజస్థాన్ హైకోర్టు తీర్పును రద్దు చేసింది. లైంగిక ఆరోపణలు నమోదైన తర్వాత, బాధితులు ప్రాణాలతో బయటపడిన సందర్భాల్లో నిందితులు, బాధితుల మధ్యలో రాజీ ద్వారా ఆయా కేసులను ఉపసంహరించుకోవడం వీలవదని స్పష్టం చేసింది. ఈ మేరకు.. సీటీ రవి కుమార్, పీవీ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో ఇంప్లీడ్ ఆర్డర్‌ను రద్దు చేస్తామని, కానీ.. ఎఫ్‌ఐఆర్(FIR), క్రిమినల్ ప్రొసీడింగ్‌లను చట్ట ప్రకారం కొనసాగిస్తామని వెల్లడించింది.

రాజస్థాన్ లో 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. దాంతో.. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న తరుణంలో.. నిందితులు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. బాధిత బాలిక కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నామని, తమపై కేసుల విచారణను కొట్టి వేయాలని అభ్యర్థించారు. దానిపై విచారణ చేపట్టిన రాజస్థాన్ హైకోర్టు.. తనకున్న సెక్షన్ 482 సీఆర్ పీసీ (CrPC) విచక్షణాధికారాన్ని వినియోగించి.. నిందితులపై నమోదైన క్రిమినల్ కేసుల్ని రద్దు చేసింది.


Also Read : సోషల్ మీడియాలో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై నిషేధం.. కోర్టులో పార్న్ వీడియో ప్రసారం..

ఈ వ్యవహారంతో హైకోర్టులు సైతం.. లైంగిక ఆరోపణలు, మహిళలు, చిన్నారులపై పాల్పడే అఘాయిత్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, కోర్టులు సైతం విఛక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీం సూచించినట్లు స్పష్టమవుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. కోర్టులు సైతం.. అన్ని విషయాల్లో తమ విఛక్షణాధికారాలను వినియోగించకుండా, సందర్భానుసారం.. సుప్రీం కట్టడి చేసినట్లు స్పష్టమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×