Aishwarya Arjun Wedding Reception: యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం జూన్ 10న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే..

చెన్నైలోని గెరుగంబాక్కంలోని హనుమాన్ దేవాలయంలో ఐశ్వర్య, ఉమాపతి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.

ఐశ్వర్య అర్జున్ వివాహం చేసుకున్న ఉమాపతి రామయ్య ప్రముఖ నటుడు, కమెడియన్, డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు అన్న విషయం తెల్సిందే.

జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ రిసెప్షన్ కి సినీ,రాజకీయ అతిరధ మహారధులు హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు.

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్స్ అందరూ ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్ హాజరయ్యారు.

ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్ తదితరులు హాజరయ్యి దంపతులకు బెస్ట్ విషెస్ తెలిపారు.




