Roja vs DMK: తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆఖరికి సీఎం స్టాలిన్ సైతం కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. 9 వేల ఓట్ల తేడాలో పరాజయం పాలయ్యారు. ఈ ఊహించని ఫలితాలపై డీఎంకే నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. నెటిజన్లు మాత్రం రోజానే ఇందుకు కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె కారణంగానే డీఎంకే దారుణంగా ఓడిపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ‘ఐరెన్ లెగ్’ ట్యాగ్ ను మరోమారు జోడిస్తున్నారు.
వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా.. తమిళనాడు ఎన్నికల్లో ఎం.కె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆమె చేత డీఎంకే పార్టీ ప్రచారం సైతం నిర్వహించింది. డీఎంకే తన మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ల గురించి రోజా తనదైన శైలిలో హైలెట్ చేశారు. ఈసారి గెలుపు డీఎంకే అభ్యర్థులదేనంటూ తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు.
సోమవారం (మే 4న) వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దెబ్బకు ఒక్కసారిగా ఖంగు తిన్నది. దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని.. మళ్లీ డీఎంకేదే అధికారమని చెప్పినప్పటికీ.. అవన్నీ తలకిందులు అయ్యాయి. సీఎం సీటు అలా ఉంచితే.. పోటీ చేసిన స్థానం నుంచే స్టాలిన్ ఓడిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సైతం ప్రారంభంలో వెనుకంజలో ఉండి.. ప్రస్తుతం కింద మీద పడుతూ అతి కష్టం మీద లీడ్ లోకి వచ్చారు. స్టాలిన్ కేబినేట్ లోని పలువురు మంత్రులు సైతం ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే డీఎంకే పార్టీ ఈ స్థాయిలో పరాభవం చెందడానికి రోజానే కారణమంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. తమ పార్టీ అధినేత జగన్ ను 11 స్థానాలకు పరిమితం చేసినట్లే.. ఇప్పుడు స్టాలిన్ ను సైతం ఆమె సీఎం సీటు నుంచి దూరం చేశారని విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో డీఎంకే క్యాంపెయినర్ రోజా వెళ్లినప్పుడే ఇలాంటి ఫలితాలను తాము ఊహించామని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రోజా ప్రచారం.. డీఎంకేకు శాపంగా మారిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
YCP Iron Leg at DMK campaign.
This is where the downfall started for DMK 🤣pic.twitter.com/DTvi027YBe
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) May 4, 2026
Also Read: Vijay – Trisha: విజయ్ సక్సెస్ వెనుక.. త్రిష మాస్టర్ ప్లాన్ ఉందా? తమిళనాట ఆసక్తికర చర్చ!
రోజా ప్రచారం చేసినా, ఆమె పార్టీలో ఉన్నా కలిసిరాదని ఆమె అంటే పడని వారు ఆరోపిస్తుంటారు. 1999లో ఆమె టీడీపీలో చేరగా.. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2004, 2009) తెలుగుదేశం పార్టీ ఓఢిపోయింది. ప్రముఖ నటి అయ్యుండి సొంత నియోజకరవర్గంలో గెలవకపోవడంతో ఆమె ప్రత్యర్థులు ఐరెన్ లెగ్ అంటూ ముద్రవేశారు. ఆ తర్వాత ఆమె టీడీపీ నుంచి వైసీపీలో చేరగా.. ఆ పార్టీ కూడా 2014 ఎన్నికల్లో ఓటమిపాలైంది. దీంతో ఐరెన్ లెగ్ ప్రచారం మరింత గట్టిగా సాగింది. ఒకానొక దశలో ఆమె ఏ నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్తే.. అక్కడి అభ్యర్థులు ఓడిపాతారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభిచారు. అవే విమర్శలు తాజాగా డీఎంకే వరకూ రావడం గమనార్హం.
Also Read: కింగ్ మేకర్ కాదు, డైరెక్ట్ కింగే.. తమిళనాట విజయ్ ప్రభంజనం.. పవన్‌కు నేర్పిన పాఠాలు!