E-Paper
Advertisement

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!
Advertisement

త‌మిళ‌నాట జ్యోతిష్యుడు ఉదంతం వైర‌ల్‌గా మారింది. అక్క‌డ సీఎం విజ‌య్ జ్యోతిష్యానికి ఇచ్చిన ప్ర‌యార్టీ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ హీరోల‌కు ఈ జ్యోతిష్యాలు, జాత‌కాలు, వాస్తు ప‌ద్ద‌తుల‌పై బాగా న‌మ్మ‌కాలుంటాయి. విజ‌య్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి జ్యోతిష్యాలు చూసుకునేవాడ‌ట‌. ఇది ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతున్న‌ది. కానీ రాజ‌కీయాల్లో ఆ పండితుడికి ఇచ్చిన ప‌ద‌వే వివాద‌స్ప‌ద‌మైంది. సినీ హీరోల్లో ఎక్కువ మంది ఈ జ్యోతిష్యాల‌ను న‌మ్ముతారు. మ‌న తెలుగు నాట బాల‌క్రిష్ణ‌కు వీటిపై బాగా గురి. ఇక రాజ‌కీయాల్లో వీటిపై కేసీఆర్‌కున్నంత న‌మ్మ‌కం, విశ్వాసం ఎవ‌రికీ లేద‌నే చెప్పాలి. అంత‌లా న‌మ్ముతాడాయ‌న‌. అయుత చండీయాగాలు చేసిన చ‌రిత్ర ఆయ‌న‌ది.

య‌జ్ఞ‌, యాగాదులు చేయ‌డం ద్వారా వ‌చ్చే ఫ‌లాలు.. పండితుల‌ను స‌త్క‌రించ‌డం ద్వారా వ‌చ్చే పుణ్యం.. అన్నింటినీ ఆయ‌న ఔపోస‌న ప‌ట్టాడ‌నే చెప్పాలి. వాస్తు ఫ‌లాల‌పైనా కేసీఆర్ అపార‌మైన విశ్వాసం ఉంది. త‌మ ప్ర‌య‌త్నానికి తోడు.. జాత‌కం ఫ‌లాలు, వాస్తు ఫ‌లాలు అనుకూలిస్తే అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌నే భావ‌న‌లో కేసీఆర్ ఉంటాడ‌ని ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న‌వారు చెబుతారు. త‌మిళ‌నాట విజ‌య్ జ్యోతిష్యుడు ఉదంతంతో ఇక్క‌డి రాజ‌కీయాల్లో ఇదిప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తుంది. ఏదైనా మంచి ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు ముహూర్తాలు చూసుకోవ‌డం కామ‌న్‌. కానీ మ‌రీ లోతుగా జ్యోతిష్యాలు, జాత‌కాలు.. వంటివి కొంద‌రే బాగా న‌మ్ముతారు.

Advertisement

ఎంత‌లా అంటే అవే త‌మ త‌ల‌రాత‌ల‌ను మార్చ‌గ‌ల‌వు.. అనేంత‌. వాటి ఆధారంగా వ్య‌క్తుల జీవితాలు ఎదుగుద‌ల ఉంటుంద‌నేంత‌గా. బ్రాహ్మ‌ణులంటే కేసీఆర్‌కు అపార‌మైన గౌర‌వం. వారికి త‌ప్ప ఆయ‌న వేరెవ‌రికీ పాదాభివంద‌నం చేయ‌డంటారు. అంత‌లా విశ్వ‌సిస్తాడు. విజ‌య్ ఇప్ప‌టి దాకా గ‌డించిన కీర్తి, విజ‌యం వెనుక‌.. ఈ జ్యోతిష్యాన్ని అనుస‌రించ‌డం కూడా ఒక కీల‌క‌మైన ఘ‌ట్టంగా భావించి ఉంటాడు. అందుకే త‌న రాజ‌కీయాల్లోకి దాన్ని తీసుకొచ్చాడు. కానీ ఓఎస్డీ లాంటి ప‌ద‌విని ఇవ్వ‌డ‌మే వివాద‌స్ప‌ద‌మైంది. ఇక్క‌డ కేసీఆర్ అలా చేయ‌లేదు. కానీ వాటిని బాగా ఫాలో అవుతాడు.త‌న గెలుపుకు, ఓట‌మికి, అన్నింటికి జాత‌కాల‌ను జోడించి చూడ‌టం ఆయ‌న‌కు అల‌వాటుగా చెబుతారు.

పురాణాల‌ను బాగా ఆల‌ళింపు చేసుకుని, శాస్త్రాల పట్ల అధ్య‌య‌నం చేసిన కేసీఆర్‌.. వీటి ప‌ట్ల మ‌క్కువ పెంచుకున్నాడంటారు. స్వ‌శ‌క్తి, ప్ర‌య‌త్నం, టాలెంట్‌తో పాటు ఇవి కూడా తోడు రావాల‌నేది ఆయ‌న ప్ర‌గాఢ న‌మ్మ‌కం. దీన్ని కొంద‌రు వెర్రితనంగా కొట్టేస్తారు. ఒక్క‌సారి దీనిపై గురి కుదిరితే అంతే… ఆథ్యాత్మిక‌త అంశానికి ప్రాధాన్య‌త‌నిచ్చి పూజ‌లు, వ్ర‌తాలు చేస్తారో.. అంతే ప్రాధాన్య‌త ఈ జాత‌కాలు, జ్యోతిష్యాల‌కూ ఇస్తారు. త‌మిళ‌నాటనే కాదు.. తెలుగునాట ఆ విశ్వాసం ఉన్న రాజ‌కీయ నేత‌ల్లో కేసీఆర్ ఆద్యుడిగా నిలుస్తాడ‌నంలో అతిశ‌యోక్తి లేదు.

Related News

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

Big Stories

Advertisement
×