E-Paper
Advertisement

ఆరెస్పీ కి డీఎస్పీ సపోర్ట్! కవిత తో గ్యాప్ పెంచుకున్న విశారదన్!

ఆరెస్పీ కి డీఎస్పీ సపోర్ట్! కవిత తో గ్యాప్ పెంచుకున్న విశారదన్!
Advertisement

ధ‌ర్మ స‌మాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు విశార‌ద‌న్ మ‌హారాజ్‌కు క‌విత‌కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. కార‌ణం.. విశార‌ద‌న్ వైఖ‌రే. ఆయ‌న ఈ మ‌ధ్య ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో ఓ కామెంట్ చేశాడు.ఆర్.ఎస్. ప్ర‌వీణ్‌కుమార్ మీద ఈగ వాలినా ఊరుకోం.. ప్ర‌భుత్వాన్ని వ‌ద‌లిపెట్ట‌మ‌ని. సీఎం రేవంత్‌రెడ్డి ప‌ని ప‌డ‌తామ‌ని.ఎందుకంటే.. తాజాగా ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ సెక్యూరిటీని త‌గ్గించేశాడు రేవంత్‌. ప్ర‌భుత్వం కుట్ర‌లో భాగంగానే ఇది చేసింద‌నేది విశార‌ద‌న్ ఉద్దేశ్యం.

అన్న‌ద‌మ్ముల మ‌ధ్యలో ఉన్న‌ట్టుగా మా ఇద్ద‌రి మ‌ధ్య చాలా వ‌ర‌కు భేధాభిప్రాయ‌లు ఉండొచ్చు. కానీ ఈ విష‌యానికొస్తే మాత్రం.. మేము రేవంత్‌ను వ‌ద‌లం.. ఆరెస్ ప్ర‌వీణ్‌ను కాపాడుకుంటాం…! అని అన్నారాయ‌న‌. బ‌హుశా ఇద్ద‌రూ ద‌ళితులే అయినందు వ‌ల్ల ద‌ళితుడి ప‌ట్ల రేవంత్ స‌ర్కార్ ఈ విధ‌మైన కుట్ర చేస్తుంద‌నేది ఆయ‌న భావ‌న అయి ఉండొచ్చు.

Advertisement

కానీ .. క‌విత‌కు ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు మ‌ధ్య సిద్దాంత‌ప‌ర‌మైన భేదాభిప్రాయాలున్నాయి. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్.. బీఆరెస్‌ ద‌య్యాల లిస్టులో ఒక‌డు. మొన్న‌టికి మొన్న బండి భ‌గీర‌థ్ కేసు విష‌యంలో కూడా క‌విత కామెంట్‌పై అవ‌హేళ‌న‌గా మాట్లాడాడు ప్ర‌వీణ్‌. దీనిపై క‌విత సీరియ‌స్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా క‌విత పార్టీ విష‌యంలో చాలా చుల‌క‌న చేస్తూ దిగ‌జారి మాట్లాడాడు ప్ర‌వీణ్‌.

అదొక పార్టీనా? అది ఒక పార్టీ అని నేను అనుకోవ‌డం లేదు. ఇప్పుడు మీరు చెబితేనే తెలిసింది? అని అహంకారం నిండిన కామెంట్ చేయ‌డాన్ని కూడా క‌విత వర్గం తీవ్రంగా ఖండించింది. ఇదిలా కొన‌సాగుతున్న క్ర‌మంలో విశార‌ద‌న్‌.. ద‌ళిత కార్డు ప్ర‌భావం మేర‌కు ఆర్.ఎస్. ప్ర‌వీణ్‌కు స‌పోర్టు చేసిన‌ట్టుగా అనిపించింది.

Advertisement

ఐక్య ఉద్య‌మాలు నిర్మిద్దామ‌ని గ‌తంలో క‌విత పిలుపునిచ్చారు. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల త‌ర‌హాలో టీఆరెస్‌, డీఎస్పీ లాగా సిద్దాంత ప‌రంగా త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలతో ఐక్య ఉద్య‌మాలు నిర్మించి స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేయాల‌ని క‌విత పిలుపునిచ్చారు. కానీ, ఈ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో క‌విత‌.. విశార‌ద‌న్‌ల మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

ఆమె ఇక‌పై పార్టీ ప‌రంగా చేసే పోరాటాల్లో, డీఎస్పీ పార్టీ ఉండ‌బోద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. త‌మ‌కు శ‌త్రువుగా ఉన్న వారితో మితృత్వం పెంచుకోవ‌డం కూడా మిత్ర‌ధ‌ర్మానికి వ్య‌తిరేక‌మ‌నే విధానం ఇప్పుడు క‌విత పార్టీ అల‌వంభించే అవ‌కాశం ఉంది. దీంతో ఇక‌పై క‌విత పార్టీ ఒంట‌రి పోరే చేయ‌నుంది.

వ‌చ్చే నెల 2న ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో ఆమె మరో భూపోరాటానికి సిద్ద‌మ‌య్యారు. ఉద్య‌మ‌కారుల‌కు ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టుగా 200 గ‌జాల స్థ‌లం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆమె ఈ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి డీఎస్పీ దూరంగానే ఉండ‌నుంది. క‌విత కూడా విశార‌ద‌న్‌కు దీనిపై ఆహ్వానం పంపిన‌ట్టు లేరు.

దీంతో మ‌రో మిలియ‌న్ మార్చి త‌ర‌హాలో క‌విత పార్టీ చేయ‌బోయే ఆ ఉద్య‌మానికి క‌విత ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌నుంద‌ని తెలుస్తోంది.

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×