E-Paper
Advertisement

కేతన్ మర్డర్ ఎఫెక్ట్.. లోహగఢ్‌కు పోటెత్తిన పర్యాటకులు.. క్రైమ్ స్పాటే టార్గెట్!

కేతన్ మర్డర్ ఎఫెక్ట్.. లోహగఢ్‌కు పోటెత్తిన పర్యాటకులు.. క్రైమ్ స్పాటే టార్గెట్!
Advertisement

Lohagad Murder: మహారాష్ట్ర పుణెలోని లోహగఢ్ కోటలో జరిగిన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాబోయే భర్త అగర్వాల్ ను.. ప్రియుడితో కలిసి సియా గోయల్ చంపడం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. కోటలోని ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి కేతన్ ను కిందికి తోసి హత్య చేశారు. అయితే ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకులు సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. లోహగఢ్ కేతన్ ను కిందికి తోసిన ప్రాంతానికి సియా పాయింట్ గా నామకరణం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

50% పెరిగిన సందర్శకులు

కేతన్ అగర్వాల్ హత్య తర్వాత.. లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో సెలవు రోజుల్లో దాదాపు 1,000 మంది పర్యాటకులు వచ్చేవారని ఇప్పుడా సంఖ్య 1,500 దాటిందని వారు పేర్కొన్నారు. అలాగే సాధారణ రోజుల్లో 400గా ఉండే పర్యాటకుల సంఖ్య.. ఇప్పుడు 600 మార్కును దాటేసిందని వెల్లడించారు.

కేవలం ఆ స్పాట్ చూసేందుకే..!

Advertisement

కోటను సందర్శించడానికి వస్తున్న వారిని పలకరిస్తే అందరూ ఒకే మాట చెబుతున్నారు. తాము చారిత్రక ప్రదేశాన్ని చూడటానికి కంటే ఆ హత్య ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనే వచ్చామని చెబుతున్నారు. ‘నిజానికి మేము విసాపూర్ కోటకు ట్రెకింగ్‌కు వెళ్లాలని అనుకున్నాం. కానీ కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అసలు అక్కడ ఏం జరిగిందో, ఏ స్పాట్ నుండి తోసేశారో చూడాలని ఇక్కడికి వచ్చాం’ అని ఒక పర్యాటకుడు తెలిపాడు.

పిల్లల నుంచి వృద్దుల వరకూ

మరో పర్యాటకుడు ప్రతీక్ బన్సోడే మాట్లాడుతూ ‘నేను కోట పైకి వెళ్లిన వెంటనే నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన ఒకటే. కేతన్‌ను ఎక్కడి నుండి తోసేశారనేది చూడాలని అనుకున్నా. ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఆ హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ స్పాట్ చూసినప్పుడు మనసు కలచివేసింది. పెళ్లి గురించి ఎన్నో కలలు కన్న ఆ యువకుడిని ఎంత దారుణంగా పొట్టనబెట్టుకున్నారో అనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

సమాజానికి ఇదొక హెచ్చరిక

Advertisement

కేతన్ అగర్వాల్ హత్య సమాజానికి ఒక హెచ్చరిక లాంటిదని కోటకు వచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరినైనా ప్రేమించినా సరే గుడ్డిగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘నిజానికి కేతన్‌ను చంపడానికి వారు నాలుగు రోజుల క్రితమే ఇదే కోటపై ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకున్నాడు. అంత జరిగినప్పటికీ ఆమెను నమ్మి మళ్లీ ఇక్కడికి రావడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది’ అని ఓ పర్యాటకుడు వాపోయాడు.

Also Read: బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

అసలేం జరిగిందంటే..?

జూన్ 18వ తేదీ ఉదయం కేతన్ తన ఇంటి నుండి బయలుదేరి పూణె – ముంబై హైవేపై ఉన్న కివాలే బ్రిడ్జ్ వద్ద సియా (20)ను పికప్ చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి లోహగఢ్ కోటకు వెళ్లాడు. ఆ తర్వాత ఉదయం 10:45 గంటల ప్రాంతంలో సియా.. కేతన్ తల్లికి ఫోన్ చేసి అతను ప్రమాదవశాత్తు కోట పైనుంచి లోయలో పడిపోయాడని నమ్మించింది. మొదట దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారని, 4 రోజుల క్రితం కూడా ఇలాగే తోసేయడానికి ప్రయత్నించారని విచారణలో తేలింది. కాగా ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉండటం గమనార్హం.

Also Read: SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!

Related News

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!

ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు.. జెన్ జీ నిరసనలు తప్పవంటూ, అవినీతి 90 శాతం ఇంటర్వ్యూల్లో

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

రైల్వే జాబ్స్.. ఆర్ఆర్‌బి జూనియర్ ఇంజినీర్ 4,098 ఖాళీలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×