E-Paper
Advertisement

అగ్గి రాజేసిన 70వేల ఉద్యోగాలు! దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో భ‌గ్గుమ‌న్న నిరుద్యోగం..!

అగ్గి రాజేసిన 70వేల ఉద్యోగాలు! దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో భ‌గ్గుమ‌న్న నిరుద్యోగం..!
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ఈ మాట‌న్నాడు. కానీ ఈసారి దీన్ని ఆషామాషీగా తీసుకోలేదు నిరుద్యోగ‌ లోకం. ఇప్పుడు ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టైంది. అందుకే దిల్‌సుఖ్‌న‌గ‌ర గ‌డ్డ ఇప్పుడు భ‌గ్గుమంటున్నది. ఇప్పుడు మ‌నం దేని కోసం చెప్పుకోబోతున్నామో మీకు అర్థ‌మై ఉంటుంది. నిన్న న‌ల్ల‌గొండ బహిరంగ స‌భ వేదిక‌గా  సీఎం రేవంత్‌రెడ్డి త‌న ప్ర‌సంగంలో ఉద్యోగాల ప్ర‌స్తాన‌వ తెచ్చాడు. కేవ‌లం 30 నెల‌ల్లోనే 70వేల ఉద్యోగాలిచ్చామ‌న్నాడు. దీనిపై అసెంబ్లీ వేదిక‌గా చ‌ర్చ‌కు కూడా సిద్ద‌మ‌ని ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరాడు.

సేమ్‌, ఇలాంటి ప్ర‌సంగాలు, ప్ర‌క‌ట‌న‌లు చాలా సార్లు సీఎం చేసినా.. అంత వివాదం కాలేదు. కానీ ఇప్పుడు ఇది ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. ఎందుకంటే. ఇప్ప‌టికే త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న కానిస్టేబుల్స్‌, ఎస్సై ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌పై ర‌చ్చ జ‌రుగుతోంది. 5వేల ఉద్యోగాల‌కు మాత్రం నోటిఫికేష‌న్ వేసేందుకు స‌ర్కార్ రెడీ అవుతుంది.

Advertisement

కానీ కావాల్సినవి 19వేల ఉద్యోగాలు. స‌ర్కార్ విడుద‌ల చేసే ఐదు వేల పోలీస్ ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్‌లో హైద‌రాబాద్‌కే 3వేల పై చిలుకు ఉద్యోగాలు అవ‌స‌రం ప‌డితే, ఇక తెలంగాణ వ్యాప్తంగా ఓ రెండు వేల ఉద్యోగాలు ఎవ‌రికి ఇస్తారు? అనే వివాదం మ‌రింత ర‌చ్చ‌కెక్కింది. క‌డుపు చించు కుంటే కాళ్ల‌మీద ప‌డ్డ‌ద‌న్న‌ట్టుగా.. ఈ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల అంశంలో స‌ర్కార్ గ‌తంలో లేని విధంగా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది.

డైబ్బైవేల ఉద్యోగాలు.. అనే అంశాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించి, ప్ర‌తిప‌క్షాల నోరు మూపియ్యాల‌ని చూసిన రేవంత్‌, ఉద్యోగాలు బాగా ఇస్తున్నాడ‌ని నిరుద్యోగుల్లో, యువ‌త‌లో ఓ పాజిటివ్ ప్ర‌చారం రావాల‌ని త‌న‌దైన వ్యూహంలో భాగంగా చెప్పుకుంటూ వ‌స్తున్న రేవంత్‌కు ఇక‌పై ఇది చెల్లుబాటు అయ్యేలా లేదు.

Advertisement

ఎందుకంటే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఎవ‌రూ వినేలా లేరు. రిజ‌ల్టు కోసం చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క‌లు తేల్చే ప‌నిలో ఉండ‌టం.. ఇది స‌ర్కార్‌కు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఏకంగా నిర‌స‌న‌ల ప‌ర్వంలోనే నిరుద్యోగులు .. నువ్విచ్చిన ఉద్యోగాలు 14వేల‌కు మించి లేవ‌ని, మిగిలినవ‌న్నీ గ‌త స‌ర్కార్ ఇష్యూ చేసిన నోటిఫికేష‌న్ల‌లో భాగంగా వ‌చ్చిన జాబ్‌ల‌కే మీరిచ్చిన నియామ‌క ప‌త్రాలే త‌ప్ప‌.. మీ ఖాతాలో ప‌డే ఉద్యోగాలు కావ‌వి.. అనే వాద‌న బ‌లంగా తెర‌పైకి తెస్తున్నారు.

ఇదీ స‌ర్కార్‌కు అస‌లు దెబ్బ‌. ఎందుకంటే ఈ మాట నిన్న‌టి వ‌ర‌కు ఒక్క బీఆర్ఎస్ నుంచే వ‌చ్చింది. కానీ ఇప్ప‌టి దాకా ఓపిక ప‌ట్టి.. స‌ర్కార్ ఇంకా ఉద్యోగాలు ఇస్తుందేమోన‌ని ఆశ పెట్టుకున్న నిరుద్యోగుల‌కు.. రేవంత్ అస‌లు ఉద్దేశ్యం అర్థ‌మైన త‌రువాత ఇక ఉద్య‌మించే ప‌రిస్థితికి ఇచ్చారు. ప్రధానంగా దీనికి కార‌ణం.. పోలీస్ ఉద్యోగాలే.

జూలై మొద‌టి వారంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామంటున్నారు. అదీ ఓ 5వేల‌కు మాత్ర‌మే. ఇక్క‌డే నిరుద్యోగలోకం భగ్గుమ‌న్న‌ది. దిల్‌సుఖ్‌న‌గ‌ర్ గ‌డ్ద రోడ్డెక్కింది. ఇదిలా ఉంటే.. న‌ల్ల‌గొండ‌లో గొప్ప‌గా, అల‌వాటులో పొర‌పాటుగా 70వేల ఉద్యోగాలు ఇచ్చామ‌ని సీఎం చెప్పుకోవ‌డం… అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టైంది. దీంతో మ‌ళ్లీ రోడ్డెక్కారు.

ఈసారి రేవంత్ స‌ర్కార్ ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాల గ‌ణాంకాలతో స‌హా. అంటే రేవంత్ అన్న‌ట్టు ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల అంశంపై చ‌ర్చ అసెంబ్లీలో కాదు.. ఇప్పుడు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో జ‌రుగుతోంది.

Related News

ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

స‌బ్జెక్టు విడిచి క్షుద్ర‌పూజ‌ల‌ను త‌ల‌చి.. సీఎం నోటి వెంటా చేత‌బ‌డుల మాట‌.. జనం ఏమ‌నుకుంటున్నారు?

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

పేదోడికి చార‌ణా.. పెద్దోడికి బారాణా! సంక్షేమ ప‌థ‌కాల తీరిదేనా? అన‌ర్హుల‌కూ ద‌క్కుతున్న ఉచిత ప‌థ‌కాలు.. !

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!

జాబ్ క్యాలెండ‌ర్ కోసం కోదండ‌రాం ఒంట‌రి పోరాటం! త‌ప్పించుకుంటున్న స‌ర్కార్‌.. త‌ప్పించుకోలేని స్థితిలో ప్రొఫెస‌ర్!

ఇంట గెల‌వాల‌నే వ్యూహం.. కేటీఆర్‌కు కంటి వెలుగు, ఇక సిరిసిల్లా పై గురి!

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

Big Stories

Advertisement
×