E-Paper
Advertisement

ఏపీ హోం మంత్రి చుట్టూ రాజ‌కీయాలు! అనిత‌ను టార్గెట్ చేసిన ప్ర‌తిప‌క్షం.. ప‌వ‌న్ మాట‌ల‌నూ అస్త్రాలుగా వాడుకుని!

ఏపీ హోం మంత్రి చుట్టూ రాజ‌కీయాలు! అనిత‌ను టార్గెట్ చేసిన ప్ర‌తిప‌క్షం.. ప‌వ‌న్ మాట‌ల‌నూ అస్త్రాలుగా వాడుకుని!
Advertisement

ఆమె ఓ మ‌హిళా మంత్రి. హోం శాఖ మంత్రి కూడా. అయినా వ‌ద‌ల్లేదు వైఎస్సార్ సీపీ. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఆమెను మేక‌ప్ మంత్రి అనడం అక్క‌డ వివాద‌మైంది. రాజ‌కీయ దుమారం రేపింది. గ‌త కొద్ది రోజులుగా ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఆమెను టార్గెట్ చేస్తున్న‌ది ప్ర‌తిప‌క్షం.

11 సీట్లే గెలిచినా.. ప్ర‌తీ విష‌యంలో ర‌చ్చ.. ర‌చ్చ చేస్తోంది వైఎస్సార్ సీపీ. ఆ స్థాయిలో ఇక్క‌డ బీఆరెస్ కూడా చేయ‌డం లేదు. జ‌గ‌న్‌ను ఆమె విమ‌ర్శించార‌ని, తిట్టార‌ని, ఏక వ‌చనంలో మాట్లాడార‌ని అందుకే తాను హోమంత్రిని మేక‌ప్ మంత్రి అని అన్నాన‌ని స‌మ‌ర్థించుకున్నాడు గుడివాడ‌. ఇవాళ అత‌న్ని ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ పిలిపించి వివ‌ర‌ణ తీసుకున్నారు.

Advertisement

గ‌తంలో గుడివాడ అమ‌ర్నాథ్ మాట్లాడిన మాట‌ల‌ను క‌మిష‌న్ సుమోటాగా తీసుకున్న‌ది. అయితే దీనిపై త‌ను మాట్లాడింది క‌రెక్టేన‌ని స‌మ‌ర్థించుకున్నాడు గుడివాడ‌. ఓ మ‌హిళా మంత్రిని మేక‌ప్ మంత్రి అని వ్యాఖ్యానించ‌డ‌మే పొర‌పాటు. అది బాడీ షేమింగ్ కింద‌కే వ‌స్తుంది. ఈ బాడీ షేమింగ్ తిట్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణంగా మారాయి.

తెలంగాణ‌లో కూడా ఈ టైప్ తిట్ల‌ను విరివిగా వాడుతున్నారు. ఇలాంటి తిట్ల వ‌ల్ల వ్యక్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డితే త‌ప్ప‌.. అవ‌త‌ల ప్ర‌త్య‌ర్థిని మాన‌సికంగా దెబ్బ‌తీశామ‌నే సంతోషం వారికి క‌ల‌గ‌డం లేదేమో! అందుకే ఈ టైప్ తిట్ల‌కు ఎగ‌బ‌డ్డారు ఇక్క‌డా. అక్క‌డా!

Advertisement

అయితే ఇక్క‌డ ఏపీలో హోం మంత్రిగా మ‌హిళ నేత ఉన్నారు. క‌నీసం ఆ సోయి కూడా లేకుండా ఆమెను టార్గెట్ చేయ‌డ‌మే ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మీలాంటి ఉద్యోగాలు మా మ‌హిళా నేత‌ల‌కు చేయ‌డం చేత‌కాదు.. !అనే వ్యాఖ్య ప‌ట్ల కూడా క‌మిష‌న్ సీరియ‌స్‌గా వివ‌ర‌ణ అడిగింది. దీనికీ ఏదో స‌మ‌ర్థింపు స‌మాధానం చెప్పుకున్నాడు అమ‌ర్నాథ్‌. కానీ ఇవి ఆమె వ్య‌క్తిత్వ హ‌న‌నానికి గురిచేసే ఉద్దేశ్యంతోనే అన్న‌ట్టుగా అత‌ని వివ‌ర‌ణ‌లోని సారాంశాన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

వారు ఇదే కోరుకుంటున్నారు కూడా. అధికార ప‌క్షాన్ని ఎంత‌లా ఇబ్బంది పెట్టాం..! ఎన్ని తిట్లు తిట్ట‌గలిగాం.. ఎంతగా ర‌చ్చ చేయ‌గ‌లిగాం.. అక్క‌డ మ‌హిళా నేత ఉన్నా స‌రే.. ఎలాంటి మాట‌ల‌తో వారిని మాన‌సిక క్షోభ‌కు గురి చేయ‌గలిగాం.. ! ఇవే కోణాల్లో ప్ర‌తిప‌క్ష నేత‌ల ఆలోచ‌న‌లు, ఆచ‌ర‌ణ‌లు అక్కడ క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యంలో ప‌వ‌న్ జోక్యం చేసుకుని మాట్లాడిన మాట‌ల‌ను కూడా త‌మ‌కు అనుకూలంగా మలుచుకున్న‌ది వైఎస్సార్ సీపీ.

ప‌వ‌న్ ఏమ‌న్నాడు? తాను హోమంత్రిని కాలేదు కాబ‌ట్టి.. క్రిమిన‌ల్స్ బ‌తికిపోతున్నారు.. అది వారి అదృష్ణ‌మ‌ని కామెంట్ చేశాడు. అంటే మీ హోమంత్రి స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా? ఆమె అస‌మ‌ర్థురాలా? ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేట‌రా..? ఇలా దీనికీ త‌మ‌దైన వ్యంగ్య కామెంట్ల‌ను జ‌త చేసి అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఇవే మాట‌ల‌న్నాడు అమ‌ర్నాథ్.

సాయికృష్ణ లాక‌ప్‌డెత్‌… బాలిక అదృశ్యం.. ఇవ‌న్నీ ఓ ర‌కంగా అక్క‌డి కూట‌మి పాల‌న‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులే తెచ్చాయి. కానీ అధికార ప‌క్షాన్ని నిల‌దీసే విష‌యంలో, ప్ర‌శ్నించే అంశంలో మాత్రం వారి మాట‌లు హద్దులు మీరుతున్నాయ‌నే విష‌యం తెలిసిపోతూనే ఉంది. తాజాగా హోమంత్రిని మేక‌ప్ మంత్రి అన‌డం మాత్రం.. ఇది వారి రాజ‌కీయ దివాళ‌త‌నానికి ప‌రాకాష్ట‌గా చెప్పుకోవాల్సి వ‌స్తుంది.

అయితే ఇలాంటివి మా ఏపీలో కామ‌నే .. అని లైట్‌గా తీసుకునే వారు లేక‌పోలేదు. కానీ పొరుగు రాష్ట్ర నేత‌లు ఈ ఏపీ రాజ‌కీయాలు చూస్తే మాత్రం విస్తుపోవాల్సిందే.

Related News

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

Big Stories

Advertisement
×