E-Paper
Advertisement

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!
Advertisement

Samsung Flip Phone Offer: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఫోన్లకు టెక్ ప్రియుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరుణంలో మీరు కూడా శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకొక మంచి అవకాశం. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్7 FE 5G ఫోన్‌పై రిలయన్స్ డిజిటల్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో ఫ్లిప్ ఫోన్ అనుభవాన్ని అందించడానికి శాంసంగ్ తీసుకొచ్చిన ఈ ఫ్యాన్ ఎడిషన్ (FE) మోడల్‌ను ఇప్పుడు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్7 FE 5G (8GB/128GB వేరియంట్) అసలు ధర రూ.89,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ల కింద ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.79,999కే లిస్ట్ అవుతుంది. అంటే.. లాంచ్ ధర కంటే నేరుగా రూ.10 వేల తక్కువకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చన్నమాట.

Advertisement

Also Read: పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

ఈ గెలాక్సీ Z ఫ్లిప్7 FE 5G డిజైన్, డిస్‌ప్లే పరంగా చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనిలో 6.7 అంగుళాల మెయిన్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనిని మడత పెట్టినప్పుడు వాడుకోవడానికి వీలుగా బయట వైపు 3.4 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది.

Advertisement

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫ్లిప్ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 4,000mAh బ్యాటరీ ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ధూళి, నీటి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ48 రేటింగ్ ఇచ్చారు. ఫోన్ విప్పినప్పుడు 6.9 మిమీ, మడత పెట్టినప్పుడు 14.9 మిమీ మందం మాత్రమే ఉంటూ చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: ధరలు పెరుగుతున్న వేళ.. Lava Agni 4పై ఊహించని డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులే!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×