E-Paper
Advertisement

ఘ‌ర్ కీ ముర్గీ దాల్ బ‌రాబ‌ర్‌! ఉద్య‌మ‌కారులను గుర్తిద్దాం రండి…! స‌ర్కార్‌ అంద‌రినీ ఆహ్వానించి…

ఘ‌ర్ కీ ముర్గీ దాల్ బ‌రాబ‌ర్‌! ఉద్య‌మ‌కారులను గుర్తిద్దాం రండి…! స‌ర్కార్‌ అంద‌రినీ ఆహ్వానించి…
Advertisement

మ‌నోడే క‌దా.. పిలిచినా ఒక్క‌టే పిల‌వ‌కున్నా ఒక్క‌టే.. అనుకున్నారేమో! పిలవ‌క‌పోతే అడిగేదెవ్వ‌రు..? అనుకున్నారేమో! లైట్ తీసుకుందాం.. మ‌నోళ్లే క‌దా! అని కూడా అనుకొని ఉంటారు. మొత్తానికి కోదండ‌రామ్ పార్టీని స‌ర్కార్‌.. ఘ‌ర్ కీ ముర్గీ దాల్ బ‌రాబ‌ర్ కింద చూసింది. మ‌న ఇంట్లో వండిన కోడి కూరైనా అది ప‌ప్పుచారుతో స‌మానమే.. అంత ఇంట్ర‌స్టు ఉండ‌ద‌న్న‌మాట! అదీ ఆ సామెత‌కు అర్థం. ఇప్పుడు మిత్ర‌ప‌క్ష‌మైన తెలంగాణ జ‌న స‌మితి విష‌యంలో కూడా ఇదే విధానం పాటించింది రేవంత్ స‌ర్కార్.

సెక్ర‌టేరియ‌ట్‌లో ఈనెల 4న ఉద‌యం 11 గంట‌ల‌కు ఓ మీటింగు పెట్టుకుంటున్న‌ది సర్కార్‌. ఉద్య‌మ‌కారులను గుర్తించి వారికి పింఛ‌న్‌, స్థ‌లం కేటాయింపు… ఇచ్చిన హామీలు అమ‌లు చేసేందుకు. దీని కోసం వేసిన కేకే క‌మిటీ అక్క‌డ ఆ రోజు భేటీ కానుంది. వీరితో చ‌ర్చించేందుకు అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం పంపింది స‌ర్కార్‌. చిన్నా చిత‌క పార్టీలు మొద‌లు.. ప్ర‌ధాన పార్టీల వ‌ర‌కు అన్నీ ఉన్నాయి వారు పంపిన ఆహ్వాన జీవో ప్ర‌తిలో. కానీ అందులో తెలంగాణ జ‌న స‌మితి పార్టీ పేరు మాత్రం మిస్ అయ్యింది.

Advertisement

మిస్ అయ్యిందా? కావాల‌నే మిస్ చేశారా? లేక‌పోతే కేకే క‌మిటీలో మెంబ‌ర్‌గా ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కోదండ‌రామే ఉన్నాడు.. ఇక ఆ పార్టీ నేత‌లు ఈ మీటింగుకు అవ‌స‌ర‌మా? అని సరిపెట్టుకున్నారా? ఇదంతా కాదు.. అస‌లు తెలంగాణ జ‌న స‌మితి అనే పార్టీ ఒక‌టి ఉంది..! అనే క‌నీస స్పృహ అయినా స‌ర్కార్‌కు ఉందా? అనే అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు టీజేఎస్‌కు చెందిన కొంత మంది నేత‌లు. ఎందుకంటే.. ఆ పార్టీని స‌ర్కార్ ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నిక‌ల‌కు ముందు మిత్ర‌ప‌క్షంగా క‌లుపుకున్నారు.

గెలిచిన త‌రువాత ప‌ద‌వులిస్తామ‌న్నారు. కానీ ఆ త‌రువాత అటు ఛాయ‌ల‌కు కూడా పోలేదు. టీజేఎస్ నేత‌లు సీఎంతో క‌లిసి ఫోటోలు దిగి రావ‌డం త‌ప్పితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దవుల ఊసు లేదు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయి.. పోతున్నాయి. కానీ వీరిని మాత్రం అటు పీసీసీ చీఫ్ ప‌ట్టించుకోవ‌డం లేదు.. సీఎం ఎలాగోలా కోదండ‌రామ్‌ను ఎమ్మెల్సీని చేసేసి హ‌మ్మ‌య్యా ..! అని చేతులెత్తేశారు. ఇప్పుడు ఏకంగా త‌మ‌ను పార్టీగా కూడా గుర్తించ‌డం లేదా ఏందీ? అనే కొత్త అనుమానానికి తెర తీసేలా స‌ర్కార్‌.. అంద‌రినీ ఆహ్వానించి..వీరిని మాత్రం విస్మ‌రించడం ప‌ట్ల‌.. అల‌క వ‌హించార‌ట ఆ పార్టీ నేత‌లు. మ‌రి ఈ విష‌యం కోదండ‌రామ్‌కు తెలిసిందా? తెలిసినా ఆయ‌న కూడా ఏం చేయ‌గ‌లడు..? వీరినే బుజ్జ‌గించ‌డం త‌ప్ప‌! అని పెద‌వి విరుస్తున్నార‌ట టీజేఎస్ నేత‌లు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×